Flipkart Mobile Bonanza సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...
ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు తన ప్లాట్‌ఫాంలో మొబైల్ బొనాంజా సేల్స్ ని నిర్వహిస్తున్నది. ఈ అమ్మకంలో ఐఫోన్ SE (2020), ఆసుస్ ROG ఫోన్ 3 మరియు Mi 10T వంటి స్మార్ట్‌ఫోన్‌లను అద్భుతమైన తగ్గింపు ధరలతో అందిస్తోంది. డిసెంబర్ 10 వ తేదీ వరకు జరిగే ఈ అమ్మకంలో షియోమి, శామ్‌సంగ్, పోకో, ఒప్పో, రియల్‌మి, ఆసుస్, ఆపిల్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ను అందించడమే కాకుండా కొన్ని ఉత్తేజకరమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు EMI ఎంపికలను కూడా అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న బొనాంజా సేల్స్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోలు మీద రూ.1,750 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఎంచుకున్న మొబైల్‌లలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ డెబిట్ కార్డు వినియోగదారులకు కూడా బొనాంజా సేల్స్ సమయంలో కొన్ని ఉత్తేజకరమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో Mi 10T డిస్కౌంట్ ఆఫర్స్
ఇండియాలో వన్‌ప్లస్ 8Tకి పోటీగా విడుదల అయిన Mi 10T ని ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో రూ.30,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,999 ధర వద్ద జాబితా చేసినప్పటికీ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలుచేసిన వారికి రూ.3,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే మీ యొక్క పాత ఫోన్‌ను రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులపై రూ.100 మినహాయింపు మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో iPhone SE (2020) తగ్గింపు ఆఫర్స్
ఆన్‌లైన్‌లో సాధారణంగా రూ.39,999 ధర వద్ద లభించే ఐఫోన్ SE(2020) స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ బొనాంజా అమ్మకం సమయంలో కేవలం రూ.32,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ప్యాకేజీలో పవర్ అడాప్టర్ మరియు ఇయర్ పాడ్స్ కూడా అదనంగా లభిస్తాయి. ఐఫోన్ SE(2020) కొనుగోలు మీద ఇప్పుడు రూ.7,000 తగ్గింపు ఆఫర్లను అందించడం ఒక మంచి ఒప్పందంగా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో Asus ROG Phone 3 డిస్కౌంట్ ఆఫర్స్
మొబైల్ గేమర్‌లు ఎక్కువగా ఇష్టపడే ఆసుస్ ROG ఫోన్ 3 ని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా అమ్మకం సమయంలో రూ.44,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ రూ.49,999 రిటైల్ ధరతో ఇండియాలో ప్రారంభమైంది. అలాగే 12GB ర్యామ్ వేరియంట్‌ను ప్రస్తుత రిటైల్ ధర కంటే రూ.2,000 తక్కువ ధరకు రూ.47,999 కు విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications








