ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్: స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లే ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్స్ ముగిసిన తరువాత మళ్ళి ఎటువంటి ప్రత్యేక సేల్స్ మొదలుపెట్టలేదు. అందుకోసం ఇప్పుడు బాలల దినోత్సవం సందర్బంగా ఈ రోజు అంటే నవంబర్ 14 నుండి నవంబర్ 18 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్స్ లో భాగంగా వివిధ రకాల మొబైల్ ఫోన్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్స్ సందర్భంగా శామ్‌సంగ్ గెలాక్సీ A 50, రెడ్‌మి K 20, రెడ్‌మి K 20 ప్రో, పోకో F1, రియల్‌మి 5, గూగుల్ పిక్సెల్ 3A , మరియు హానర్ 20 వంటి ఫోన్లను డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. నవంబర్ 18 వరకు కొనసాగుతున్న ఈ సేల్స్ లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 9 + మరియు ఆపిల్ ఐఫోన్ 7 లపై కూడా గొప్ప తగ్గింపు డిస్కౌంట్‌లను తెస్తుంది.

ఇందులో గల ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ EMI ఆప్షన్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లో ఈ సేల్స్ కింద ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై అదనపు ప్రీపెయిడ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. వినియోగదారులు తమ ప్రస్తుత హ్యాండ్‌సెట్‌లకు బదులుగా అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్ యొక్క ముఖ్యమైన ఒప్పందాలలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 50 యొక్క బేస్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ను ప్రారంభ ధర రూ.14,999ల వద్ద పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణంగా దీని ధర 18,490 రూపాయలు.

ఫ్లిప్‌కార్ట్ అమ్మకం అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల కింద శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 30 ఎస్, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్, వివో వి 17 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై 5,000 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా వివో జెడ్ 1 ప్రో, రియల్‌మి ఎక్స్, వివో జెడ్ 1 ఎక్స్, మరియు రియల్‌మి3 వంటి హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రీపెయిడ్ లావాదేవీలపై అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు
| స్మార్ట్‌ఫోన్ | ఒరిజినల్ ధర | డిస్కౌంట్ ధర |
| శామ్‌సంగ్ గెలాక్సీ A 50 | 18,490 | 14,999 |
| రెడ్‌మి K 20 | 21,999 | 19,999 |
| రెడ్‌మి K 20 ప్రో | 27,999 | 25,999 |
| పోకో F1 | 18,999 | 14,999 |
| రియల్‌మి 5 | 9,999 | 8,999 |
| ఒప్పో F11 ప్రో | 16,990 | 15,990 |
| రియల్‌మి 3 ప్రో | 12,999 | 9,999 |

| స్మార్ట్‌ఫోన్ | ఒరిజినల్ ధర | డిస్కౌంట్ ధర |
| Oppo F11 | 15,980 | 12,990 |
| Honor 20 | 32,999 | 24,999 |
| Samsung Galaxy S9 | 29,999 | 27,999 |
| Samsung Galaxy S9+ | 49,990 | 34,999 |
| iPhone 7 32GB | 29,900 | 24,999 |
| Google Pixel 3a | 39,999 | 29,999 |
| Google Pixel 3a XL | 44,999 | 34,999 |
| Moto E6s | 7,999 | 6,999 |
| Redmi 7A | 5,999 | 5,799 |
| Realme 3 | 8,999 | 7,999 |
| Realme 3i | 7,999 | 7,499 |
| Realme 5 Pro | 13,999 | 12,999 |
| Nokia 6.1 Plus | 11,999 | 8,999 |
| Motorola One Action | 13,999 | 10,999 |


Click it and Unblock the Notifications








