ఐఫోన్ 7 రూ. 25 వేలకే సొంతం చేసుకోండి

By Gizbot Bureau
|

పండగ సీజన్‌లో స్పెషల్ ఆఫర్లతో అదరగొట్టి.. వినియోగదారులను ఆకట్టుకున్నాయి ఈ-కామర్స్ సంస్థలు.. మొబైల్స్‌తో పాటు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బట్టలు ఇలా తదితర వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్లతో సేల్స్ పెంచుకున్నాయి. ఇక, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ ఫోన్లపై స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది.. "మొబైల్స్ బొనాంజా" పేరుతో మొబైల్ ఫోన్లను స్పెషల్ డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా.. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ స్పెషల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ50, రెడ్‌మీ కే20, కే20 ప్రొ, పోకో ఎఫ్1, రియల్‌మి 5, గూగుల్ పిక్సల్ 3ఏ, హానర్ 20 స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఇక సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ నచ్చిన ఫోన్‌ను అందుకునే అవకాశం ఉంది.

ఐఫోన్లపై ఆఫర్లు
 

ఐఫోన్లపై ఆఫర్లు

ఇక ఐఫోన్ 7, ఐఫోన్ 11, ఐఫోన్ 11ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను కూడా స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయి. మొత్తానికి ఈ డిస్కౌంట్ ఆఫర్లలో ఫోన్లపై రూ.500 నుంచి రూ.15000 వరకు తగ్గింపు ధరలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ సేల్ లో ఐఫోన్ 7ను రూ. 25 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 7 ఫీచర్లు

ఐఫోన్ 7 ఫీచర్లు

ఈ ఫోన్ ని ఈఎంఐలో కొనుగోలు చేస్తే నెలకు రూ. 4167 చెల్లిస్తే సరిపోతుంది. ఎక్సేంజ్ ఆఫర్ కింద ఈఫోన్ మీద రూ. 10,800 డిస్కౌంట్ అందిస్తున్నారు. రీకాల్ అనంతరం ఆపిల్ ఐఫోన్ ఐఓఎస్ 10 అప్ డేట్ తో వచ్చింది. అలాగే కొన్ని డివైస్ లు ఐఓఎస్ 13 అప్ డేట్ తో వచ్చాయి. 32 జిబి ర్యామ్ వేరయంట్ మూడు రంగుల్లో లభిస్తోంది. Gold, Black and Rose Gold రంగుల్లో దీనిని యూజర్లు కొనుగోలు చేయవచ్చు. 4.7-inch Retina HD display. It is powered by Apple A10 Fusion 64-bit processor and is embedded M10 motion co-ప్రాసెసర్, 12 ఎంపీ కెమెరా, 7 ఎంపీ సెల్పీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ 50
 

శాంసంగ్ గెలాక్సీ ఎ 50

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్ ఆఫర్స్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎ 50 యొక్క బేస్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ను ప్రారంభ ధర రూ.14,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 18,490 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకం అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల కింద శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 30 ఎస్, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్, వివో వి 17 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై 5,000 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా వివో జెడ్ 1 ప్రో, రియల్‌మి ఎక్స్, వివో జెడ్ 1 ఎక్స్, మరియు రియల్‌మి3 వంటి హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రీపెయిడ్ లావాదేవీలపై అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది.

ఇతర ఫోన్లపై ఆఫర్

ఇతర ఫోన్లపై ఆఫర్

శాంసంగ్ ఏ50, రెడ్‌మి కే20, రియల్‌మి 5, గూగుల్ పిక్సెల్ 3ఏతోపాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈఎంఐ ఛార్జీలు లేకుండా ఐఫోన్ 11 సిరీస్ ఫోన్స్ లభించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ50 రూ. 14,999, రియల్‌మి 5 ఫోన్ రూ. 8,999, ఒప్పో ఎఫ్11 ప్రో ఫోన్ రూ. 15,990 లభించనుంది. ఈ ఆఫర్ నవంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple iPhone 7 available at less than Rs 25,000 in Flipkart’s Mobiles Bonanza sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X