మొబైల్స్ పై ఎప్పుడు లేనంత డిస్కౌంట్ లతో ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన బొనాంజా సేల్స్

|

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ మరో అమ్మకంతో తిరిగి వచ్చింది. ఈ రోజు జూన్ 17 నుండి ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో ప్రముఖ మొబైల్స్ బొనాంజా అమ్మకాలను నిర్వహిస్తోంది. అమ్మకం సమయంలో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై ధరల విభాగాలు మరియు బ్రాండ్‌లలో పెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది.

 ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన బొనాంజా సేల్స్

 

కాబట్టి మీరు చాలా కాలంగా స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధర వద్ద కొనాలని చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ మీకు ఉత్తమమైనది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ జూన్ 21 తో ముగుస్తుంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

మొబైల్స్ బొనాంజా సేల్స్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో షాపింగ్ చేసే కొనుగోలుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును ఇవ్వడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ ఇఎంఐ లావాదేవీలపై కూడా అదనంగా 250 రూపాయలు మినహాయింపు ఇస్తోంది. కాబట్టి అన్ని డిస్కౌంట్ ఆఫర్లతో పాటు కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాండ్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో షాపింగ్ పై అదనంగా 10 శాతం రాయితీ పొందగలుగుతారు. ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా అమ్మకం సందర్భంగా లభించే ఉత్తమ ఆఫర్‌లను శీఘ్రంగా చూద్దాం.

షియోమి రెడ్‌మి 6:

షియోమి రెడ్‌మి 6:

మొబైల్స్ బొనాంజా సేల్స్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ రెడ్‌మి 6 ను 7499రూపాయల తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే రెడ్‌మి 6 యొక్క 32 జిబి మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ రెండూ మొబైల్ లు ఒకే ధర వద్ద లభిస్తాయి. కాబట్టి మీరు తక్కువ ధర ఉన్న ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే రెడ్‌మి 6మొబైల్ మంచి లక్షణంగా పరిగణలోకి తీసుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 6 ప్రో:
 

రెడ్‌మి నోట్ 6 ప్రో:

షియోమి రెడ్‌మి ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ సమయంలో 13,999 రూపాయల తక్కువ ధరకు అమ్ముతోంది. ముఖ్యంగా అమ్మకం సమయంలో రెడ్‌మి నోట్ 6 ప్రో యొక్క 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఆసుస్ 5Z:

ఆసుస్ 5Z:

ఆసుస్ 6Zను ఇండియాలో కొన్ని రోజుల్లో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ముందుగా ఆసుస్ 5Z ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ అమ్మకం సందర్భంగా భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఆసుస్ 5Z చాలా తక్కువ ధర వద్ద కేవలం 21,999 రూపాయలకు అమ్ముడవుతోంది . ఆసుస్ 6Z వస్తున్నందున ధర తగ్గడం స్పష్టంగా ఉంది.

శామ్సంగ్ గాలక్సీ A50:

శామ్సంగ్ గాలక్సీ A50:

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్ బొనంజా అమ్మకాల సమయంలో శామ్సంగ్ గాలక్సీ A50 స్మార్ట్ ఫోన్ ధర 18,490 రూపాయలకు విక్రయిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీA50 పొందడానికి ఇదే ఉత్తమమైన సమయం.కాబట్టి మీరు ఒక మంచి ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ ను 20000రూపాయల కంటే తక్కువలో చూస్తున్నట్లయితే శామ్సంగ్ గెలాక్సీ A50 ఒక మంచి గొప్ప ఎంపిక అవుతుంది.

రెడ్మి నోట్ 5 ప్రో:

రెడ్మి నోట్ 5 ప్రో:

ఈ షియోమి డివైస్ ఏడాదిన్నర పాతది అయినప్పటికీ ఈ సంస్థ నుండి అతిపెద్ద మరియు అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్. రెడ్‌మి నోట్ 5 ప్రో ఫ్లిప్‌కార్ట్ బొనాంజా అమ్మకం సమయంలో 11,999 రూపాయల ధరలకు అమ్ముడవుతోంది. స్మార్ట్‌ఫోన్ పొందడానికి ఇది ఉత్తమ సమయం.

ఐ ఫోన్X:

ఐ ఫోన్X:

ఆపిల్ యొక్క పదవ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ X కూడా ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు కేవలం 66,499రూపాయలకు లభిస్తుంది. అదనంగా కొనుగోలుదారులు ఎల్లప్పుడూ అమ్మకం సమయంలో లభించే ఆఫర్లను ఉపయోగించి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.

ఒప్పో F11:

ఒప్పో F11:

ఒప్పో ఫోన్ చాలా కాలం క్రితం లాంచ్ అయింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే రాయితీ ధరలకు అమ్ముడవుతోంది. ఒప్పో F11 ప్రో ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్స్ సమయంలో కేవలం 17,990 రూపాయల ధరలకు అమ్ముడవుతోంది.

వివో V15 ప్రో:

వివో V15 ప్రో:

సరికొత్త వివో Vసిరీస్ కూడా చాలా తక్కువ ధర వద్ద అమ్ముడవుతోంది. వివో V15 ప్రో మొబైల్ ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్స్ సమయంలో కేవలం 26,990 రూపాయల వద్ద అమ్ముడవుతోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8:

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8:

ఈ శామ్‌సంగ్ నోట్ రూ .36,990 తక్కువ ధరకు అమ్ముతోంది. ఇప్పుడు ఇది చాలా పాత మొబైల్ ఫోన్ అయినప్పటికి 40,000రూపాయల లోపు ఫోన్లలో ఇది మంచి ఎంపిక.

LG V40 ThinQ:

LG V40 ThinQ:

LG ఫోన్ మీద భారీ ధర తగ్గింపును పొందింది. ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్స్ సమయంలో ఎల్‌జీ వి 40 థిన్‌క్యూ మొబైల్ ఫోన్ కేవలం 39,999 రూపాయల ధర వద్ద అమ్ముడవుతోంది. మీరు LG అభిమాని అయితే అదనంగా ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్స్ లో LG V30 + కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.27,999 తక్కువ ధరతో అమ్మబడుతోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
flipkart mobiles bonanza sale begins today here are top smartphone discount offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X