Home
News

ఫ్లిప్కార్ట్ మంత్ ఎండ్ సేల్ మొదలైంది! స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, లిస్ట్ చూడండి

By Maheswara

భారతదేశంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రత్యేకమైన ఆఫర్ల ప్రయోజనాలతో మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్‌ సేల్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ వ్యవధిలో కొనుగోలుదారులు సులభంగా షాపింగ్ చేయడానికి బ్యాంక్ తగ్గింపులు మరియు నో కాస్ట్ EMI ఎంపికలు వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్‌ సేల్ జూన్ 29 వరకు కొనసాగే ఆఫర్, ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ నుండి గూగుల్ పిక్సెల్ 7a వరకు వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.ఈ మొబైల్ ఫెస్ట్ సందర్భంగా మీకు లభించే టాప్ డీల్స్ ఇక్కడ ఉన్నాయి గమనించండి.

Flipkart Month End Mobiles Fest 2023 Sale Live Now, Huge Discount Offers On These Smartphones. Offers List.

శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G
ఈ సేల్ లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లను వర్తింపజేసిన తర్వాత మీరు శాంసంగ్ నుండి తాజా ఫ్యాన్ ఎడిషన్ హ్యాండ్‌సెట్‌ను రూ. 31,999 తో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G లో 6.4 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X 120Hz FHD+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12, 4500mAh బ్యాటరీ, 12MP + 12MP + 8MP బ్యాక్ కెమెరాలు మరియు 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
ఇంకా అత్యంత ప్రీమియం ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే యాపిల్ అభిమానుల కోసం ఈ సేల్ రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ ని అందిస్తుంది. దీనితో ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను రూ. 1,24,999కి పొందవచ్చు. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ లో 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR ప్యానెల్, A16 బయోనిక్ చిప్ సెట్, iOS 16, 48MP + 12MP + 12MP బ్యాక్ మరియు 12MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ఐఫోన్ 13 ఆఫర్ వివరాలు
ఫ్లిప్కార్ట్ సేల్ లో బ్యాంకు ఆఫర్‌లు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను వర్తింపజేసిన తర్వాత మీరు ఐఫోన్ 13ని రూ. 57,499 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.1-అంగుళాల OLED డిస్ప్లే, A15 బయోనిక్ చిప్, iOS 16, 12MP + 12MP బ్యాక్ మరియు 12MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

నథింగ్ ఫోన్ (1)
నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ (2)ని త్వరలో లాంచ్ చేయబోతున్నందున, కంపెనీ నుండి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లు అందించిన తర్వాత ఇప్పుడు రూ. 28,249 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.55 అంగుళాల FHD+ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 778G+, నథింగ్ OS, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 50MP + 50MP బ్యాక్ మరియు 16MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 7a
గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ రూ. 4,000 తగ్గింపును పొందిన తర్వాత కొనుగోలుదారులు సరికొత్త గూగుల్ పిక్సెల్ 7a ని రూ. 39,999 లోపు పొందవచ్చు. ఇది 6.1 అంగుళాల FHD+ స్క్రీన్, టెన్సర్ G2 SoC, ఆండ్రాయిడ్ 13, 4300mAh బ్యాటరీ, 64MP + 13MP బ్యాక్ మరియు 13MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart Month End Mobiles Fest 2023 Sale Live Now, Huge Discount Offers On These Smartphones. Offers List.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X