Flipkart Monumental Sale 2025 ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్.. ఈ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు..!
అమెజాన్ ఇటీవల గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 13 తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. అదే ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే సేల్ లో పాల్గొనవచ్చు. అయితే మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ప్రత్యేక సేల్‌ను ప్రకటన చేసింది. మాన్యూమెంటల్ సేల్ / రిపబ్లిక్ డే సేల్ (Flipkart Monumental Sale 2025) జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు జనవరి 13 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చని వెల్లడించింది.
ఈ ఉత్పత్తులపై డిస్కౌంట్ లు :
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్ లు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, టీవీలు, ట్యాబ్లెట్ లు సహా ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు గృహోపకరణాలను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ కు సంబంధించిన డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ వెల్లడించింది.

ఈ కార్డుపై 5 శాతం డిస్కౌంట్‌లు :
ఫ్లిప్‌కార్ట్ Monumental sale లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసి 5 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఈ సేల్ కు సంబంధించిన వివరాలు క్రమంగా విడుదల అవుతున్నాయి. ఆపిల్, గూగుల్, శాంసంగ్, ఒప్పో, రియల్‌మి, మోటోరోలా సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్ లు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లు :
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 ను రూ.63,999 కే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 10 జెన్ ఆపిల్ ఐప్యాడ్ ను రూ.27,999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.59,999 ధరకు సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది.
ప్రత్యేక డీల్స్ :
దీంతోపాటు త్వరలో మరిన్ని ఆఫర్ల వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి గంటకు ప్రత్యేక డీల్స్ అందుబాటులోకి వస్తాయని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుండగా ఎప్పటి వరకు సేల్ నిర్వహించనున్నారనే వివరాలు వెల్లడి కాలేదు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 :
అయితే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 12 గంటల ముందే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. జనవరి 19 వరకు సేల్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అమెజాన్‌లో ఈ సంస్థల ఫోన్‌లపై డిస్కౌంట్‌లు :
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్, ఐకూ, మోటోరోలా, శాంసంగ్, వివో, హానర్, పోకో, రెడ్‌మి, రియల్‌మి, టెక్నో వంటి స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








