Flipkart సేల్.. మోటో స్మార్ట్‌ఫోన్‌పై 34 శాతం ధర తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజ సేల్ ( Flipkart sale )నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తోంది. ఇందులో భాగంగా మోటో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మోటో G14 స్మార్ట్‌ఫోన్ (Moto G14) ఫ్లిప్‌కార్ట్‌లో 34 శాతం తగ్గింపు లభించింది. దీంతో ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది.
మోటో G14 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 128 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ Unisock T616 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 OSను కలిగి ఉంటుంది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, మరియు మైక్రో SD కార్డు సాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌తోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. మరియు EMI ఆఫర్ ద్వారాను కొనుగోలు చేయవచ్చు.
మోటో G14 స్పెసిఫికేషన్లు : మోటో G14 స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 2400*1080 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. మరియు 84.47 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది.

ఈ మోటో స్మార్ట్‌ఫోన్ Unisock SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు Mali-G57 GPU సపోర్టును కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై తగ్గింపు ఆఫర్ ఉంది. మైక్రో SD సపోర్టుతో అంతర్గత స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.
మోటో G14 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 8MP స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటుంది. మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
కెనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G VoLTE, వైపై, బ్లూటూత్ 5.0, GPS, USB-C, 3.5 ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఇది స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సౌండ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. మోటో G14 స్మార్ట్‌ఫోన్ స్కై బ్లూ, మరియు స్టీల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








