ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ఫ్లస్ స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ ఆఫర్.. మరికొన్ని గంటలు మాత్రమే..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus) ఫ్లిప్‌కార్టులో బెస్ట్ తగ్గింపు ధరను పొందింది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయింది. అనంతరం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మరో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఇందులో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ బెస్ట్ ఆఫర్‌ను కలిగి ఉంది.
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదల అయింది. విడుదల సమయంలో ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచింగ్ తర్వాత ఐఫోన్ 14 ప్లస్ ధరను సంస్థ రూ.10000 తగ్గించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ను రూ.30,999కి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.66,999గా ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు పాత ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.34,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లతోపాటు, బ్యాంకు డిస్కౌంట్లతో కలిపి ఐఫోన్ 14 ప్లస్‌ను ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.30,999కే కొనుగోలు చేయవచ్చు.
అయితే ఈ ఐఫోన్ 14 ప్లస్ గత సంవత్సరం విడుదల అయింది. అయినా పెద్దగా కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. అయితే ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ లాంచింగ్ తర్వాత .. ఎక్కువ మంది ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.
ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లూ, పర్పల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ వంటి రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ భద్రతో వస్తుంది. మరియు అప్‌గ్రేడ్ చేసిన A15 బయోనిక్ చిప్ సహా ఆపిల్ GPU 5 కోర్ గ్రాఫిక్స్‌తో పనిచేస్తుంది.
ఈ ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో ప్రధాన కెమెరాతోపాటు అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ ఫ్లాష్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 26 గంటల వరకు బ్యాటరీ టైం వస్తుందని ఆపిల్ చెబుతోంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా వైఫై 802, బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది. మరియు ఫేసే ఐడీ, యాక్సిలిరో మీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్, బారోమీటర్ సెన్సార్లను కలిగి ఉంది. మరియు లైటినింగ్, USB 2,0 పోర్టును కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








