Home
News

iPhone 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. మీకు ఈ ఆఫర్‌ ఉందో లేదో తనిఖీ చేసుకోండి!

ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 12 (iPhone 12) పై భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ వేరియంట్‌ ధర రూ.54,900 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.46,999కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ Axis Bank కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చని తెలుస్తోంది. ఈ ఆఫర్‌ మీ ప్రాంతంలో ఉందో లేదో తెలుసుకొనేందుకు మీ ప్రాంతం పిన్‌కోడ్‌ను నమోదు చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.

iPhone 12 smartphone

ఐఫోన్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుక వైపు 12MP డ్యూయల్‌ లెన్స్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే 12MP ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఫలితంగా నాణ్యమైన ఫోటో, వీడియోలను తీసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ A14 బయోనిక్‌ చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అదనంగా ఈ ఫోన్‌ సిరామిక్‌ షీల్డ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు IP68 రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ విజన్‌ HDRను సపోర్టు చేస్తుంది. ఫలితంగా మెరుగైన నాణ్యతతో వీడియో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

దీంతోపాటు నైట్‌మోడ్‌ టైమ్‌ ల్యాప్స్‌ వీడియో ఫీచర్ ద్వారా నాణ్యమైన వీడియోను రికార్డు చేయవచ్చు. స్టాండర్డ్‌ 8 బిట్‌ వీడియో రికార్డింగ్‌తో పోలిస్తే 10 బిట్‌ HDR వీడియో రికార్డింగ్‌ 60 రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఐఫోన్‌ 12పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పటి వరకు ఆఫర్‌ ఉంటుందో వెల్లడించలేదు.

*ఆపిల్ సెప్టెంబర్ 12న నిర్వహించిన వండర్‌ లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్‌ తాజా మోడల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers huge discount on iPhone 12 smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X