మీరు స్టూడెంటా ...? అయితే Flipkart లో పనిచేయడానికి ఇదే చక్కని అవకాశం.

By Maheswara
|

ఈ పండుగ సీజన్లో Walmart యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్ ద్వారా వేలాది గా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని చూస్తోంది.ఈ సంస్థ ఇప్పుడు టైర్- II నగరాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ లను అందిస్తుంది. పండుగ సీజన్ మరియు బిగ్ బిలియన్ డేస్ కంటే ముందే విద్యార్థులు తమ 'లాంచ్‌ప్యాడ్' ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కింద డెలివరీ చైన్ లో పనిచేస్తారని ఫ్లిప్‌కార్ట్ శనివారం ప్రకటించింది.

 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 45 రోజుల చెల్లింపు కార్యక్రమంగా ఉంటుంది. ఇది విద్యార్థులకు Flipkart డెలివరీ మరియు e కామర్స్  నిర్వహణలో క్లిష్టమైన నైపుణ్యాలను పొందటానికి మరియు ఇ-కామర్స్ పరిశ్రమ కోసం శిక్షణ పొందిన నిపుణుల వ్యవస్థను సృష్టించడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమం గత సంవత్సరం ప్రారంభించబడింది మరియు ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా డెలివరీ మరియు e కామర్స్  నిర్వహణను నేర్చుకోవడానికి భారతదేశం అంతటా 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read: samsung ఫోన్ల పై భారీ ఆఫర్లు! రూ.85 వేల ఫోన్ ఇప్పుడు రూ.55 వేలకే, ఇంకా ఎన్నో ....!Also Read: samsung ఫోన్ల పై భారీ ఆఫర్లు! రూ.85 వేల ఫోన్ ఇప్పుడు రూ.55 వేలకే, ఇంకా ఎన్నో ....!

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

ఈ-కామర్స్ యొక్క వెన్నెముకగా ఏర్పడే డెలివరీ ప్రక్రియలను విద్యార్థులు  అర్థం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించింది. ఫ్లిప్‌కార్ట్ ఈ కార్యక్రమం "భారతదేశ భవిష్యత్ శ్రామిక శక్తిని అవసరమైన సరఫరా గొలుసు పాత్రలలో రూపొందించడానికి" రూపొందించబడింది. ఫ్లిప్కార్ట్ సంస్థ బినోలా (హర్యానా), భివాండి (మహారాష్ట్ర), ఉలుబేరియా మరియు డంకుని (పశ్చిమ బెంగాల్) మరియు మలూర్ (కర్ణాటక), మేడ్చల్ (తెలంగాణ) మొదలైన 21 ప్రదేశాలలో విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.  "ఇంటర్న్‌షిప్‌లు యువ విద్యార్థులలో వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు వారిలో చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా రూపొందించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది" అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు.

250 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్

250 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్

డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, పికర్స్, ప్యాకర్స్ మరియు సార్టర్స్‌తో సహా సంస్థ యొక్క సరఫరా గొలుసులో పండుగ సీజన్లో 70,000 ప్రత్యక్ష మరియు లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ గత నెలలో ప్రకటించింది. 80 కి పైగా విభాగాలలో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తులను అందిస్తున్న ఫ్లిప్కార్ట్ , 250 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్ను నమోదు చేసింది. ఈ నెల మొదట్లో అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు బిగ్ బిలియన్ డేస్ అమ్మకం కోసం తేదీలను ప్రకటించింది. మరోవైపు, అమెజాన్ కూడా ఇటీవలే అక్టోబర్ 17 నుంచి తన నెల రోజుల గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ఇ-కామర్స్ కంపెనీలు ఈ  పండుగ అమ్మకాల మొదటి దశలో 4 బిలియన్ డాలర్ల స్థూల వస్తువుల విలువ గల అమ్మకాలు జరపవచ్చని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తెలియచేసింది.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Offers Internship Programme For Students To Gain e-Commerce Skills

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X