అమెజాన్‌కు దిమ్మతిరిగింది, భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఉచితంగా..

    విదేశీ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు స్వదేశీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు తెరలేపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను సవాల్ చేస్తూ 'ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌'పేరుతో కస్టమర్‌ లోయల్టి ప్రొగ్రామ్‌ను లాంచ్‌ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీన్ని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కాగా ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ప్రారంభించడం ఇది రెండో సారి. తొలిసారి 2014లో 'ఫ్లిప్‌కార్ట్‌ ఫస్ట్‌' పేరుతో ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్‌ చేసింది. దీని పూర్తి వివరాల్లోకెళితే..

    ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డును పొందడం ఎలా ?

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు మాదిరిగా..

    ఫ్లిప్‌కార్ట్‌ కొత్త లోయల్టి ప్రొగ్రామ్‌, అచ్చం దాని ప్రత్యర్థి అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు మాదిరిగానే ఉంటుంది.కాగా అమెజాన్‌ ప్రైమ్‌ లాంచ్‌ చేసిన రెండేళ్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ ఈ లోయల్టి ప్రొగ్రామ్‌ను తీసుకొస్తోంది.

    ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ ఉచితం

    ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ పూర్తిగా ఉచితం. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ ప్రొగ్రామ్‌కు ఎలాంటి వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు లేదు. అమెజాన్‌ మాత్రం తన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌కు ప్రవేశ ఆఫర్‌ కింద 499 రూపాయలను తీసుకున్నది. ప్రస్తుతం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు 999 రూపాయలుగా నెలవారీ ఫీజు 129 రూపాయలుగా ఉంది.

    ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ ప్రయోజనాలు

    ఈ ప్రొగ్రామ్‌ కింద కస్టమర్‌ లోయల్టీ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేయనుంది. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫామ్‌పై సేల్‌ ఆఫర్లు నిర్వహించే సమయంలో ఉచిత డెలివరీకి, ముందస్తు షాపింగ్‌కు, ముందస్తుగా ప్రొడక్ట్‌లు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు.

    సేల్స్‌ నిర్వహించే సమయంలో..

    అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు మాదిరి, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు కూడా సేల్స్‌ నిర్వహించే సమయంలో ముందస్తు యాక్సస్‌ను పొందవచ్చు.

    ఎలా పనిచేస్తుంది

    ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో జరిపే ప్రతి కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ కింద ప్లస్ కాయిన్లను యూజర్లకు ఆఫర్‌ చేస్తుంది. ఈ ప్లస్‌ కాయిన్లను తర్వాత కంపెనీ వెబ్‌సైట్‌లో జరిపే షాపింగ్‌కు వాడుకోవచ్చు. ఈ ప్లస్‌ కాయిన్లను జోమాటో, బుక్‌మైషో, మేక్‌మైట్రిప్‌ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా వాడుకోవచ్చు.

    100 మిలియన్‌ కస్టమర్లలో..

    తమ 100 మిలియన్‌ కస్టమర్లలో ఎవరైనా ఈ కాయిన్లను పొందవచ్చని, ప్రయోజనాలను, రివార్డులను అన్‌బ్లాక్‌ చేసుకోవడం ప్రారంభించుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

    మూడేళ్లలో 173 మిలియన్‌ డాలర్లను..

    కాగా గత నెలలోనే ఫ్లిప్‌కార్ట్‌ ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేసింది. కానీ కుదరలేదు. దీనికోసం వచ్చే మూడేళ్లలో 173 మిలియన్‌ డాలర్లను కూడా వెచ్చించబోతుంది.

    కస్టమర్లను ఆకట్టుకోవడానికి ..

    ఇదిలా ఉంటే రిటైల్‌ స్పేస్‌లో లోయల్టీ ప్రొగ్రామ్‌లు మంచి పేరును సంపాదించుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    Flipkart Plus launched, to take on Amazon Prime; know membership benefits, rewards and how to join
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more