ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026.. తేదీ, డీల్స్, బ్యాంకు ఆఫర్ల వివరాలు..!
Flipkart Republic Day Sale 2026 : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ పైన ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లు 24 ముందుగానే అంటే జనవరి 16 వ తేదీ నుంచే ఈ సేల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్ లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై చేసే లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపింది.
ఈ ఉత్పత్తులపై డిస్కౌంట్! :
సేల్ తేదీ సహా బ్యాంకు డిస్కౌంట్లు మినహా ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గ్యాడ్జెట్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ను అందించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ డిస్కౌంట్ ల వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

ఆపిల్ ఫోన్‌లపై :
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ఐఫోన్‌లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో నిర్వహించిన సేల్స్ లోనూ ఆపిల్ ఫోన్‌లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్ లో కూడా ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్ తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ పై డిస్కౌంట్ అందిస్తుందా లేదా తెలియాల్సి ఉంది.
ఆండ్రాయిడ్ మోడల్స్‌పై :
ఆపిల్ ఫోన్‌లతోపాటు అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల పైన డిస్కౌంట్ ను అందించే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్, ఇయర్‌బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌ల పైన డిస్కౌంట్ ను అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై :
వీటితోపాటు వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. సాధారణ డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో మరింత డిస్కౌంట్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు.
గత రెండు మూడు నెలల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపుపై ప్రకటనలు ఇస్తున్నాయి. నథింగ్, శాంసంగ్ ఇటీవల కొన్ని ప్రముఖ మోడల్స్ పై ధరలను సవరించాయి.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026.. ఈ ధరల పెంపు నుంచి స్మార్ట్‌ఫోన్ లు సహా ఇతర యూజర్లకు కాస్త ఉపసమనం ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డిస్కౌంట్లు, సహా ఇతర ఎక్స్ఛేంజీ ఆఫర్లపై ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఈ సేల్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








