పండగ ఆఫర్ల తరువాత మళ్లీ సేల్స్ సీజన్ వచ్చేసింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్ తేదీలను ప్రకటించిన వెంటనే దేశీయ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ కూడా మూడు రోజుల ఆఫర్ల పండుగకు తెరలేపుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లకు రిపబ్లిక్ డే సేల్ అని పేరు పెట్టింది. కాగా ఈ సేల్ జనవరి 21 నుంచి ప్రారంభమై, జనవరి 23 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టాప్ ఆఫర్లతో కూడిన ప్రిప్యూ పేజీని కంపెనీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.డీల్ వివరాలపై ఓ లుక్కేయండి.
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వస్తోంది, డిస్కౌంట్లపై ఓ కన్నేయండి !
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్
అసలు ధర రూ. 60,499
విక్రయ ధర రూ. 48,999
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ. 10వేల తగ్గింపు
షియోమి ఎంఐ మిక్స్ 2
అసలు ధర రూ. 37,999
విక్రయ ధర రూ. 29,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్7
అసలు ధర రూ. 46,000
విక్రయ ధర రూ. 26,990
రెడ్‌మి నోట్ 4
అసలు ధర రూ. 12,999
విక్రయ ధర రూ. 10,999
మోటో జీ5 ప్లస్
అసలు ధర రూ. 16,999
విక్రయ ధర రూ. 10,999
Samsung Galaxy On Nxt 64GB
అసలు ధర రూ. 17,900
విక్రయ ధర రూ. 10,999
Panasonic Eluga A3
అసలు ధర రూ. 11,499
విక్రయ ధర రూ. 6,499
70 శాతం వరకు తగ్గింపును..
వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై, ఆడియో, కెమెరా, యాక్ససరీస్‌లపై 60 శాతం వరకు తగ్గింపును, టీవీ, హోమ్ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది.
అమెజాన్ Sale
అమెజాన్ కూడా ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటలు ముందుగానే అంటే జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.
భారీ ఆఫర్లు
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ కేటగిరీల్లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది.
ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్..
అంతేకాదు అమెజాన్ పే యూజర్స్ రూ.250 అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్ (రూ.200 వరకు) ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.