ఫ్లిప్‌కార్ట్ మరో మూడు రోజుల సేల్, సరికొత్త ఆఫర్లతో..

Written By:

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ మధ్యే బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సేల్ ముగిసి నేటికి కేవలం రెండు రోజులు మాత్నౌరమే అవుతోంది. అయితే ఈ లోపే మరో ప్రత్యేక సేల్ కి ఫ్లిప్ కార్ట్ రెడీ అవుతోంది. ఈ సేల్ ద్వారా ఈ కామర్స్ దిగ్గజం వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవాలని అనుకుంటోంది.

డిస్కౌంట్లకు పుల్‌స్టాప్,పెరగనున్న జియో మొబైల్ డేటా ఛార్జిల ధరలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 నుంచి 17వ తేదీ వరకు..

ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు న్యూ పించ్ డేస్ పేరిట సేల్‌ను నిర్వహించనుంది.

ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు

ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఉత్పత్తులపై వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.

షియోమీ ఎంఐ ఎ1, వివో వీ7, శాంసంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (64జీబీ) మోడల్స్

ఫ్టిప్‌కార్ట్ నిర్వహించనున్న న్యూ పించ్ డేస్ సేల్‌లో షియోమీ ఎంఐ ఎ1, వివో వీ7, శాంసంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (64జీబీ) మోడల్స్ తక్కువ ధరలకే లభ్యం కానున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను..

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తు అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు.

ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, టీవీలు..

మొబైల్ యాక్ససరీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు రాయితీలను ఇవ్వనున్నారు. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్యాషన్, హోమ్, ఫర్నిచర్, బ్యూటీ, స్పోర్ట్స్, బుక్స్, టాయ్స్‌పై కూడా ఆఫర్లు ప్రవేశపెట్టనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart reveals big offers and deals for upcoming New Pinch Days sale; runs between 15-17 December Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot