120 గంటలు, 120 డీల్స్.. దూసుకొస్తోన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివల్ సేల్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసింది. బిగ్ బిలయన్ డేస్ పేరుతో అక్టోబర్ 10వతేదీ నుంచి 14వతేదీ వరకు ఈ సేల్ జరగబోతోంది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివల్ సేల్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసింది. బిగ్ బిలయన్ డేస్ పేరుతో అక్టోబర్ 10వతేదీ నుంచి 14వతేదీ వరకు ఈ సేల్ జరగబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అందించబోతోన్న డిస్కౌంట్స్ అలానే ఆఫర్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం..

క్రేజీ డీల్స్ (CRAZY DEALS)...
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా CRAZY DEALS పేరిట సరికొత్త డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ అందించబోతోంది. సేల్ పిరియడ్‌లో భాగంగా ప్రతి 8 గంటలకు ఒకసారి ఈ క్రేజీ డీల్స్ అనేవి అప్‌డేట్ అవుతుంటాయి. వివిధ రకాల వస్తువుల పై ఈ విధమైన క్రేజీ డిల్స్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

మహా ప్రైస్ డ్రాప్ (MAHA PRICE DROP)..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మహా ప్రైస్ డ్రాప్ (MAHA PRICE DROP) పేరిట లిమిటెడ్ అవర్ సేల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా 20శాతం అదనపు తగ్గింపుతో వివిధ రకాల వస్తువులను సొంతం చేసుకునే వీలుంటుందని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.

రష్ అవర్ (RUSH HOUR)
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రష్ అవర్ (RUSH HOUR) పేరిట మరో లిమిటెడ్ అవర్ సేల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రోడక్ట్స్ అదనపు డిస్కౌంట్ రేట్లతో అందుబాటులో ఉంటాయి. సేల్ ప్రారంభమైన తరువాత మొదటి రెండు గంటలు మాత్రమే ఈ రష్ అవర్ సేల్ అనేది అందుబాటులో ఉంటుంది.

ఫ్లాష్ సేల్ (FLASH SALE)
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లాష్ సేల్ (FLASH SALE) పేరిట మరో ఆసక్తకిర సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా గంటలో సేల్ చొప్పున 120 గంటల పాటు 120 రకాల డీల్స్ అందుబాటులో ఉంటాయి.

మొబైల్ ఫోన్‌ల పై నోరూరించే డీల్స్..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల పై నోరూరించే డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ అందించబోతోంది. ఈ డీల్స్‌లో భాగంగా బుయ్‌బ్యాక్ గ్యారంటీ, గ్రేట్ ఎక్స్‌ఛేంజ్, మాస్టర్ కార్డ్ మొదటి ఆన్‌లైన్ పేమెంట్ పై 10 శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్, హెచ్‌డీఎస్ ఇంకా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈఎమ్ఐ ట్రాన్సాక్షన్స్ పై 5 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్డ్ ప్రొవైడ్ చేస్తోంది. నోకియా, ఒప్పో, వన్‌ప్లస్,సామ్‌సంగ్ ఇంకా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది.

ఫ్యాషన్ ఉత్పత్తుల పై 90% వరకు తగ్గింపు..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తుల పై 90% తగ్గింపును అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. లెవిస్, లావీ, ఫ్లయ్యింగ్ మెచీన్, రాడో, నైక్ వంటి హైక్వాలిటీ బ్రాండ్స్ పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

టివీలు & గృహోపకరణాలు పై 80% వరకు తగ్గింపు..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ టీవీలతో పాటు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల పై 80% వరకు తగ్గింపును అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. సేల్ పిరియడ్‌లో భాగంగా 55 ఇంచ్ టీవీని 43 ఇంచ్ టీవీ ధరకే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇదే సమయంలో వాషింగ్ మెచీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా స్ప్లిట్ ఎయిర్‌కండీషనర్స్ పై కూడా భారీ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

గాడ్జెట్స్ ఇంకా యాక్సెసరీస్ పై 80% వరకు తగ్గింపు..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గాడ్జెట్స్ ఇంకా యాక్సెసరీస్ పై 80% వరకు తగ్గింపును ప్రొవైడ్ చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. సేల్ పిరియడ్‌లో భాగంగా పలు కంపెనీలకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లను రూ.50,000 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. డెల్, యాపిల్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన ల్యాప్‌టాప్స్ పై భారీ డిస్కౌంట్లన సిద్థం చేసి ఉంచినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి హెడ్‌ఫోన్స్ ఇంకా స్పీకర్స్‌ను తక్కువలో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇదే సమయంలో టాబ్లెట్స్, స్మార్ట్ వాచెస్ ఇంకా గేమింగ్ కన్సోల్స్ పై ఆకర్షణీయ డిస్కౌంట్లను సిద్థం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

హోమ్ అండ్ ఫర్నిచర్ పై 50-90% తగ్గింపు..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా హోమ్ అండ్ ఫర్నిచర్ పై 50-90% వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. జాక్ పాట్ డీల్స్ క్రింద బెడ్స్ అలానే బెడ్ షీట్స్ పై 90శాతం డిస్కౌంట్లను ప్రొవైడ్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రెస్టీజ్, హోమ్ టౌన్, బోస్చ్ ఇంకా బాంబే డయ్యింగ్‌లకు సంబంధించిన ఉత్పత్తుల పై 40 నుంచి 70శాతం వరకు డిస్కౌంట్లను సిద్థం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.


Click it and Unblock the Notifications