ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్స్, రెండు రోజుల పాటు ఆఫర్లు

  అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కౌంటర్ ఇస్తూ ఆఫర్లతో దూసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్‌ షాపింగ్‌ డేస్‌, జూలై 19 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, డ్రస్‌లు, గాడ్జెట్లు వంటి ఇతర ఉత్పత్తులపై బంపర్‌ ఆఫర్లను, బిగ్‌ డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ కూడా జూలై 16నే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్‌ సేల్‌ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. ఫ్లిప్ కార్ట్ డీల్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

   

  ఈ సంవత్సరం లాంచ్ అయిన 10 సంచలన స్మార్ట్‌ఫోన్‌లు!

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌

  ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫోన్‌ రూ.42,999కే అందుబాటులో ఉంటుంది. దీనిలోనే ఎక్స్చేంజ్‌పై 3 వేల రూపాయల తగ్గింపు, 8 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 37 వేల రూపాయల వరకు బై-బ్యాక్‌ ఆఫర్‌ గ్యారెంటీ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌కు లభ్యమవుతుంది.

  శాంసంగ్‌ 80సీఎం(32) హెచ్‌డీ టీవీను రూ.16,999కే కొనుగోలు చేసుకోవచ్చు. శాంసంగ్‌ ఫోన్ల ధరలు 10,900 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి.

  ఎయిర్‌ కూలర్స్‌

  ఎయిర్‌ కూలర్స్‌, ఫ్యాన్లను రూ.999 నుంచే ఆఫర్‌ చేస్తుంది. 999 రూపాయల కంటే తక్కువకే బ్లూటూత్‌ స్పీకర్స్‌ లభ్యం కానున్నాయి. హెడ్‌ఫోన్లు, ఛార్జర్స్‌పై 75 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది.

  గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై

  గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై 37 వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఏసర్‌ ప్రిడేటర్ హిలియోస్‌ 300 ల్యాప్‌టాప్‌ ధర రూ.89,990 నుంచి రూ.63,990కు తగ్గుతుంది.

  50 శాతం తగ్గింపు

  ఈ సేల్‌లో టీ-షర్ట్‌లు, షార్ట్‌లపై 50 శాతం తగ్గింపును అందుబాటులో ఉంచుతుంది. రెండు జతల సన్‌ గ్లాసెస్‌ను రూ.999కే అందిస్తుంది.

  కనీసం వెయ్యి రూపాయలు తగ్గింపు

  ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకున్న కనీసం వెయ్యి రూపాయలు తగ్గింపును యూజర్లు పొందనున్నారు. అదనంగా నో కాస్ట్‌ ఈఎంఐ స్కీమ్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది.

  సుమారు 80 శాతం డిస్కౌంట్‌

  వీటితో పాటు వస్త్రాలు, ఫుట్‌వేర్‌, కిడ్స్‌ ఫ్యాషన్‌ వంటి వాటిపై సుమారు 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. అలాగే మెజార్టీ ఉత్పత్తులపై కూడా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది.

  Panasonic P95

  Panasonic P95
  MRP Price: 6,490
  Discounts Price: 3,999
  Key Specs 5-inch (1280 x 720 pixels) HD display 1.3 GHz quad-core Qualcomm Snapdragon 210 (MSM8909) Mobile Platform with Adreno 304 GPU 1GB RAM 16GB internal storage expandable memory with up to 128GB microSD Android 7.1.2 (Nougat) 8MP auto focus rear camera with LED flash 5MP front-facing camera 4G VoLTE 2300mAh battery

  Honor 9i

  Honor 9i MRP Price: 19,999
  Discounts Price: Rs 14,999

  హువాయి హానర్ 9ఐ ఫీచర్లు:
  5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, లౌడ్ స్పీకర్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16+2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. 3340 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2.

  హానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతం

  Vivo V7 Plus

  Vivo V7 Plus MRP Price: 21,990
  Discounts Price: Rs 19,990

  వివో వీ7 ప్లస్ ఫీచర్లు:
  5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Flipkart Big Shopping Days Sale Starts July 16: Google Pixel 2 Sees Rs. 27,000 Price Cut, Other Big Offers more news at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more