Home
News

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. తక్కువ ధరకే ఐఫోన్ 14 ను కొనుగోలు చేయవచ్చు.. బ్యాంకు ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌..!!

ఆపిల్‌ ఐఫోన్‌ 14 ను (iPhone 14 Offer Price) ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.56,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Apple.com లోనూ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 14.. 128GB అంతర్గత స్టోరేజీ బ్లూ కలర్‌ వేరియంట్‌ ధర రూ.55,999 గా ఉంది. ఇతర కలర్‌ వేరియంట్‌ల ధర రూ.58,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ ధర రూ.68,999 మరియు 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.88,999 గా ఉంది.

iphone 14 Smartphone can be buy under RS55999

ఐఫోన్ 14 స్టోరేజీ వేరియంట్లకు అనుగుణంగా ప్రొడక్ట్‌ రెడ్‌, బ్లూ, మిడ్‌నైట్‌, పర్పల్‌, స్టార్‌ లైట్‌ మరియు యెల్లో రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. HDFC, HSBC బ్యాంకుల క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3500 తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు కాంబో ఆఫర్లపైన రూ.3000 తగ్గింపును ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీంతోపాటు ఇతర బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపును పొందే అవకాశం ఉంది. అయితే డిస్కౌంట్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. పాత మోడల్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఐఫోన్ 14 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 1200 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా డాల్బీ విజన్‌ సపోర్టుతో వస్తుంది. ఆపిల్‌ A15 బయోనిక్ SoC చిప్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ముందువైపు ప్లాట్ ఎడ్జ్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ప్రేమ్‌ సహా సిరామిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌ సెట్ 12MP వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 12MP 120 డిగ్రీల అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 12MP ట్రూ డెప్త్‌ సెన్సార్‌తో వస్తుంది. మరియు IP68 డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌తో రానుంది. ఫలితంగా 6 మీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నాకూడా సక్రమంగా పనిచేస్తుంది.

ఈ కెమెరాల ద్వారా 4k వీడియోలను రికార్డ్ చేయవచ్చు. మరియు 1080 పిక్సల్‌ HD వీడియో రికార్డింగ్‌, 720P HD వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాలు దీని సొంతం. సినిమాటిక్‌ మోడ్‌, యాక్షన్‌ మోడ్‌, స్లో మోషన్ వీడియో సపోర్టు, టైమ్‌ ల్యాప్స్‌ వీడియో సపోర్టు, నైట్‌ మోడ్‌ టైం ల్యాప్స్‌ వంటి ఫీచర్లున్నాయి. దీంతోపాటు 2X ఆప్టికల్ జూమ్, 3x వరకు డిటిటల్‌ జూమ్, స్టీరియో రికార్డింగ్‌ వంటి ఫీచర్లున్నాయి.

ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 3279mAh బ్యాటరీ ప్యాక్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో రానుంది. గరిష్ఠంగా 20 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ లేదా 16 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్, గరిష్ఠంగా 80 గంటల వరకు ఆడియో బ్యాక్‌ ఉంటుంది. భద్రత పరంగా ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై, డిటిటల్‌ కంపాస్‌, GPS ఫీచర్లున్నాయి.

Best Mobiles in India

English summary
Flipkart sale iphone 14 Smartphone can be buy under RS55999 in india 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X