Flipkart సేల్ అఫ్ ది డే లో ఈ ఫోన్‌లపై రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ చేయకండి
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్స్ ని నిర్వహిస్తున్నది. జులై 18 వరకు జరిగే ఈ సేల్స్ లో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. కానీ ఇటీవల లాంచ్ అయి మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చిన ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద భారీ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా మోటో మరియు ఇన్ఫినిక్స్ బ్రాండ్లు ఇటీవల లాంచ్ చేసి అమ్మకానికి అందుబాటులోకి తీసుకొనివచ్చిన ఫోన్ల కొనుగోలు మీద రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్స్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉండడంతో కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి దీని కంటే మంచి సమయం మరొకటి లభించదు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G42 కొనుగోలుపై SBI రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్
భారతదేశంలో మోటో G42 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ రూ.13,999 ధర వద్ద అట్లాంటిక్ గ్రీన్ మరియు మెటాలిక్ రోస్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లోని సేల్ లో లభించే లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే SBI కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు మీద రూ.2,549 విలువైన జియో ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G కొనుగోలుపై యాక్సిస్ బ్యాంక్ రూ.1,500 డిస్కౌంట్ ఆఫర్
ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8Gb ర్యామ్ + 256GB స్టోరేజ్ ఏకైక సింగిల్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ లో రూ.17,999 ధర వద్ద ఫోర్స్ బ్లాక్ మరియు ఫోర్స్ వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క సేల్స్ లో యాక్సిస్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారు రూ.1,500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 12 5G కొనుగోలుపై యాక్సిస్ బ్యాంక్ రూ.1,500 డిస్కౌంట్ ఆఫర్
ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 6Gb ర్యామ్ + 64GB స్టోరేజ్ ఏకైక సింగిల్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ లో రూ.14,999 ధర వద్ద ఫోర్స్ బ్లాక్ మరియు ఫోర్స్ వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క సేల్స్ లో యాక్సిస్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారు రూ.1,500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ అడ్రినో 610 GPU మరియు 4GB LPDDR4x ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ షూటర్‌తో 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ ఫోటోలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64GB ఆన్‌బోర్డ్ uMCP స్టోరేజ్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ లోని అదనపు మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి కూడా మద్దతును ఇస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 700nits గరిష్ట ప్రకాశంతో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రూపొందించబడిన XOS 10.6తో స్మార్ట్‌ఫోన్ షిప్పింగ్ చేయబడి ఉండి ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పాటు మాలి G57 GPU తో రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది 8GB LPDDR4X RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16MP ఫ్రంట్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ బ్యాకప్ కోసం 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డెడికేటెడ్ మైక్రో-SD కార్డ్ స్లాట్ మరియు స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఫోర్స్ బ్లాక్ మరియు ఫోర్స్ వైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో వస్తుంది. దీని బరువు 188గ్రాములు మరియు కొలతలు 164.67 × 76.9 × 7.98 మిమీ. పరికరం యొక్క కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-సిమ్, 5G, WiFi 802.11 ac, బ్లూటూత్ 5.0, GPS మరియు గ్లోనాస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








