Just In
- 4 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 9 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Sports
IND vs NZ:భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Movies
Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
4 రోజుల పాటు Flipkart ఫ్లాష్ సేల్స్, రూపాయి సేల్ కూడా..
మరో ఆఫర్ల పండగకు ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు 'బిగ్ షాపింగ్ డేస్'ను నిర్వహించనుంది. 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ షాపింగ్ డేస్‌లో మొబైళ్లు, భారీ గృహోపకరణాల విభాగంలో పలు ఆఫర్లు అలాగే డిస్కౌంట్లను అందించనుంది. ఈ నాలుగు రోజులు షాపింగ్ డేస్ లో ఆరు రెట్ల మేర అమ్మకాలు నమోదు అవుతాయని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేస్తోంది. నాలుగు రోజుల పాటు 'బిగ్ షాపింగ్ డేస్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర గృహోపకరణాలపై పెద్దఎత్తున తగ్గింపు ధరలు ప్రకటించనుంది. స్మార్ట్‌ఫోన్లపై వీలైనంత తగ్గింపు ధరలు అందించడంతో పాటు, ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహించనుంది.

క్రెడిట్ కార్డులపై కొనుగోళ్ళకు ఆఫర్లు
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు భారీ ఆఫర్లను ప్రకటించనుంది క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు బైబ్యాక్ గ్యారంటీ ని అందించనుంది. కొన్ని వస్తువులపై ఎక్సెండెడ్ వారంటీని కూడ అందించనుంది.

ఒక్క రూపాయి సేల్
వంద శాతం క్యాష్‌బ్యాక్ పొందేలా ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ పొందేలా వినియోగదారులకు గేమ్స్ నిర్వహించనుంది. ఈ గేమ్‌లో విజయం సాధిస్తే కేవలం ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్, మొబైల్స్ గెలుచుకొనే అవకాశం కల్పించనుంది.

అమెజాన్ కూడా..
ఈ సేల్ లో ఏ కంపెనీ ఫోన్లు డిస్కౌంట్ ధరలను అందుకుంటాయనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే దీనికి పోటీగా అమెజాన్ కూడా తన అప్ కమింగ్ సేల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సేల్ మే 11 నుంచి 14 వరకు జరిగే అవకాశం ఉందని అనధికార వర్గాల సమాచారం.

ఎంఐ ఫోన్ల మీద ఓపెన్ సేల్
ప్రధానంగా ఎంఐ ఫోన్ల మీద ఓపెన్ సేల్ అలాగే అసుస్ ఫోన్ల మీద ఆఫర్లు మోటో, లెనోవొ, హువాయి దేశీయ మొబైల్ బ్రాండ్ల మీద తగ్గింపులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ మధ్య లాంచ్ అయిన స్మార్ట్ టీవీలు కూడా తగ్గింపు ధరలతో లభించనున్నాయని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున మొబైల్స్ విక్రయాలు..
కొన్ని వస్తువులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్దమైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున మొబైల్స్ విక్రయాలు జరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470