ఫ్లిప్‌‍కార్ట్ దుమ్ము రేపింది.. ఒక్క రోజులో 8 లక్షలు ఫోన్‌లు సేల్

భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌‍కార్ట్, బిగిబిలియన్ డేస్ సేల్‌లో భాగంగా సోమవారం 8 లక్షల స్మార్ట్‌పోన్‌లను విక్రయించినట్లు చేసినట్లు సమాచారం.

ఫ్లిప్‌‍కార్ట్ దుమ్ము రేపింది.. ఒక్క రోజులో 8 లక్షలు ఫోన్‌లు సేల్

Read More : మార్కెట్లోకి మోటరోలా కొత్త ఫోన్‌లు..మోటో జెడ్, మోటో జెడ్ ప్లే

ఈ ఫోన్‌ల విలువ దాదాపుగా రూ.645 కోట్లు ఉండొచ్చని ఓ అంచనా. గత కొంత కాలంగా ఇండియన్ రిటైల్ మార్కెట్లో స్మార్ట్‌‌ఫోన్‌లకు విస్తృతమైన డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌‍కార్ట్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచిన అమెజాన్ ఇండియా తన ఆన్ గోయింగ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు అమ్ముడైన మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన అమ్మకాల గణంకాలను వెల్లడించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ సెల్లింగ్ ఫోన్లు..

షియోమీ, మోటరోలా, సామ్‌సంగ్, యాపిల్ బ్రాండ్లకు సంబంధించి టాప్ సెల్లింగ్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్స్‌డేస్ సేల్‌లో భాగంగా భారీ రాయితీల పై అందుబాటులో ఉంచింది.

అమెజాన్ నుంచి...

మరోవైపు అమెజాన్ లెనోవో, షియోమీ, సామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ సేల్‌లో అందుబాటులో ఉంచింది.

ఓపెనింగ్ డే సేల్‌లో భాగంగా..

ఓపెనింగ్ డే సేల్‌లో భాగంగా ఇండియన్ రిటైల్ మార్కెట్ మొత్తం ఒక్క రోజులో విక్రయించిన ఫోన్‌లను తాము ఒక గంటలో విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ ఒకరు తెలిపారు.

బెంగుళూరు కేంద్రంగా..

బెంగుళూరు కేంద్రంగా సేవలందిస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్‌లు ఎక్కువుగా అమ్ముడవుతాయి. ఇందకు కారణం చాలా వరకు ట్రాప్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్లిప్‌‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేస్తోంది.

స్నాప్‌డీల్.. లక్ష ఫోన్‌లు

మరోవైపు స్నాప్‌డీల్ తన ఆన్ గోయింగ్ అన్‌బాక్స్ దివాళీ సేల్‌లో భాంగా మొదటి 16 గంటల్లో లక్ష ఫోన్‌లను విక్రయించినట్లు తెలిపింది.

రెగ్యులర్ మార్కెట్‌తో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 1న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సేల్ మొదటి రోజున రెగ్యులర్ మార్కెట్‌తో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ మార్కెట్ జరిగినట్లు అమెజాన్ తెలిపింది.

30 నిమిషాల్లో లక్ష ప్రొడక్ట్స్...

సేల్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లో లక్ష ప్రొడక్ట్స్, మొదటి 12 గంటల్లో 15 లక్షల ప్రొడక్ట్స్‌ను విక్రయించినట్లు అమెజాన్ తెలిపింది.

16 గంటల్లో 11 లక్షల ఆన్‌లైన్ షాపర్స్...

తన అన్‌బాక్సుడ్ దివాళీ సేల్ మొదటి రోజులో భాగంగా సేల్ ప్రారంభమైన తొలి 16 గంటల్లో 2,800 పట్టణాల నుంచి 11 లక్షల ఆన్‌లైన్ షాపర్స్ వివిధ రకాల ప్రొడక్ట్స్ కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో తెలపింది.

సెకనుకు 180 ఆర్డర్స్..

అర్థరాత్రి ప్రారంభమైన తమ సేల్‌లో భాగంగా ఒక్కో సెకనుకు 180 ఆర్డర్స్ నమోదైనట్లు స్నాప్‌డీల్ తెలిపింది.

 

తొలి గంటలో 5 లక్షల ప్రొడక్ట్స్‌

తన బిగ్‌బిలియన్‌డేస్ మొదటి రోజు సేల్‌లో భాగంగా సేల్ ప్రారంభమైన తొలి గంటలో 5 లక్షల ప్రొడక్ట్స్‌ను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

యాపిల్ వాచ్‌లు భారీగా...

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో నెల మొత్తం మీద విక్రయించిన యాపిల్ వాచ్‌లను తాము కేవలం 10 నిమిషాల్లో విక్రియించినట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart sells 8 lakh phones worth $100 million. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot