ఫ్లిప్‌కార్ట్.. మూడు సార్లూ ఖాళీ బాక్సులనే పంపింది (వీడియో)

|

ఆన్‌లైన్ కొనుగోలుదారుల పట్ల ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు వ్యవహరిస్తున్న తీరు పై గతకొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తటాన్ని సోషల్ మీడియా ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాం. స్నాప్‌డీల్ ఉదంతం మరవక ముందే ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

 
ఫ్లిప్‌కార్ట్.. మూడు సార్లూ ఖాళీ బాక్సులనే పంపింది (వీడియో)

Image Source

పెన్‌డ్రైవ్‌ను ఆర్డర్ చేసకున్న ఓ ఆన్‌లైన్ షాపర్‌కు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు ఖాళీ బాక్సులను పంపింది. నమ్మశక్యంగా లేదు కదూ!! ఈ వీడియో ఆధారాన్ని చూస్తే నమ్మక తప్పదు.

 

మైసూర్‌కు చెందిన ఆదర్శ్ ఆనందన్ ఫ్లిప్‌కార్ట్ వద్ద పెన్‌డ్రైవ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే, తనకు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఖాళీ బాక్స్ మాత్రమే అందింది. విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ దృష్టికి తీసుకువెళ్లటంతో పెన్‌డ్రైవ్‌తో పాటు రూ.55 పరిహారాన్ని అందిస్తామని సదరు రిటైలర్ హామీ ఇచ్చింది. అయితే రెండో సారి డెలివరీని ఆదర్శ్ ఆనందన్ తల్లి అందుకుంది. ఆ సమయంలో ఆనందన్ ఇంట్లో లేరు.

ఇంటికి వచ్చిన తరువాత ఫ్లిప్‌కార్ట్ డెలివరీని తెరిచి చూసిన ఆనందన్ ఒక్కాసారిగా షాక్‌కు గురయ్యారు. రెండో సారి కూడా తనుకు ఖాళీ బాక్సే అందింది. ఈ విషయాన్ని మరోసారి ఫ్లిప్‌కార్ట్ దృష్టికి తీసుకువెళ్లిన ఆనందన్‌కు సంబంధిత విభాగం నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ఆనందన్ కావాలనే ఇదంతా చేస్తున్నట్లు సదరు రిటైలర్ పరోక్షంగా నిందలు వేసే ప్రయత్నం చేసింది. దీంతో విసుగు వేసారి పోయిన ఆనందన్ దరదృష్టం తనను వెంటాతోందనుకుని మరోసారి ఫ్లిప్‌కార్ట్ వద్ద కొత్తగా పెన్‌డ్రైవ్‌ను ఆర్డర్ చేసాడు. క్యాష్ ఆన్ డెలివరీలో భాగంగా ఎప్పటి లాగానే డెలివరీ సిబ్బంది ఆనందన్ బుక్ చేసుకున్న ఆర్డర్‌ను ఇంటికి తీసుకువచ్చారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయి ఉన్న ఆనందన్ మూడో సారి కాస్తంత తెలివిగా ఆలోచించి, ఆ ఆర్డర్‌ను సిబ్బందితోనే ఓపెన్ చేయించి, ఆ దృశ్యాలను తన స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేసాడు. ముచ్చటగా మూడోసారి కూడా ఫ్లిప్‌కార్ట్ ఖాళీ బాక్సునే పంపింది.

This video first published on Daily Bhaskar

తాను నష్ట పరిహారం కోసం చూడటం లేదని, ఈ వీడియో ప్రూఫ్ ఆధారంగానైనా ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్‌లు తమ తప్పులను తెలుసుకుని వినియోగదారుల పట్ల నమ్మకంగా వ్యవహరిస్తే చాలని ఆదర్శ్ ఆనందన్ తన ఆవేదనను వెళ్లగక్కారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Flipkart sends empty box to customer thrice instead of the pendrive he ordered [video]. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X