తెలంగాణాలో ఫ్లిప్‌కార్ట్‌ తొలి అడుగు, రాజధానిలో తొలి డేటా సెంటర్

|

తెలంగాణా రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్‌ తొలి అడుగు వేసింది. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కంపెనీ మొదటి డేటా సెంటర్ ని ప్రారంభించింది. తెలంగాణాలో ఇది మొదటిది కాగా ఇండియాలో రెండవది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్‌ ఆపరేటర్‌ 'కంట్రోల్‌ ఎస్‌’ (సీటీఆర్‌ఎల్‌ ఎస్‌) పార్టనర్‌షిప్‌తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్‌ ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు. విక్రయదారులు, ఎంఎస్‌ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని, నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సెంటర్‌ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడుస్తుందని ఆయనపేర్కొన్నారు.

తెలంగాణాలో ఫ్లిప్‌కార్ట్‌ తొలి అడుగు, రాజధానిలో తొలి డేటా సెంటర్

 

తెలంగాణ ఐటీ, కామర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఈ డేటా సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డేటా సెంటర్స్‌ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దీంతో మరిన్ని కంపెనీలు ఇక్కడకు రావడానికి ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.

విద్యుత్ ఆదా డాటా సెంటర్లలో

విద్యుత్ ఆదా డాటా సెంటర్లలో

టైర్-4 శ్రేణిలో రూపొందించిన ఈ సెంటర్ విద్యుత్ వినియోగంలో చాలావరకు పునరుత్పాదక శక్తి ద్వారా వచ్చేదేనని, అత్యంత విద్యుత్ ఆదా డాటా సెంటర్లలో ఇది కూడా ఒకటని, వ్యాపార నిర్వహణ, అమ్మకం, కొనుగోలుదారులకు మెరుగైన సేవలను అందించడానికి డాటా సెంటర్లు కృషి చేస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వ సహకారం మరువలేనిది

ప్రభుత్వ సహకారం మరువలేనిది

రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం బాగుందని ఆయన ప్రశంసించారు. మాకు అన్నివిధాలా చేయూతనిచ్చిందని కొనియాడారు. చేసిన ప్రతీ ప్రయత్నం ఫలించేలా దోహదపడిందన్నారు. కాగా, 2007లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తొలి రాష్ట్రం తెలంగాణ
 

తొలి రాష్ట్రం తెలంగాణ

దేశంలో డాటా సెంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చేలా, ఓ అంకితభావంతో కూడిన విధానాన్ని ఆచరణలో పెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. తమ విధానం సత్ఫలితాలనిస్తుండటం ఆనందంగా ఉందని ఫ్లిప్‌కార్ట్ డాటా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.

ఐటీ, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులకు

ఐటీ, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులకు

ఫ్లిప్‌కార్ట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఐటీ, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ నేడు తొలి ప్రాధాన్యతగా ఉందని గుర్తుచేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ వ్యాపార, పారిశ్రామిక రంగాలను అమితంగా ఆకట్టుకుంటున్నదని చెప్పారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart sets up data centre in India at Hyderabad move to help firm

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X