నకిలీ ఐఫోన్ ను పంపిణి చేసిన ఫ్లిప్‌కార్ట్‌.. అది కూడా బెంగళూరులో

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్‌ చేసినదానికి బదులుగా మరొక దానిని పంపిణీ చేయడం కొత్త కాదు. ఇప్పుడు అటువంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇండియాలో నకిలీ ఐఫోన్లు చలామణి అవుతున్న తరుణంలో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో నకిలీ ఐఫోన్‌ను పంపిణీ చేయడం పెద్ద దుమారాన్ని లేపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నకిలీ ఐఫోన్
 

బెంగళూరుకు చెందిన రజనీ కాంత్ కుష్వా అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆపిల్ ఐఫోన్ 11 ప్రోను ఆర్డర్ చేసాడు. అతను ఫ్లిప్‌కార్ట్ అందించిన డిస్కౌంట్ మినహాహించిన తర్వాత రూ.93,900ల మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. పైగా అతను ఫ్లిప్‌కార్ట్ లో వేగవంతమైన డెలివరీని ఎంచుకున్నాడు. ఫ్లిప్‌కార్ట్ అనుకున్నంత వేగంగా ఆపిల్ ఐఫోన్ 11 ప్రోను డెలివరీ చేసింది. అతను అందుకున్న తరువాత అతను ఆశించిన స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా దాని నకిలీ ఫోన్ ను చూసి కంగుతిన్నాడు.

లాంగ్ టర్మ్ ప్యాక్‌లను తొలగించిన DTH ఆపరేటర్లు

ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్ ద్వారా డెలివరీ అయిన తరువాత బాక్స్ ను ఓపెన్ చేసినప్పుడు రజనీ కాంత్ కుష్వా ఐఫోన్ వలె కనిపించే నకిలీ ఐఫోన్ ను కనుగొన్నారు. ఈ నకిలీ ఐఫోన్ కు వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండడానికి బదులుగా కేవలం స్టిక్కర్ మాత్రమే ఉండడం వలన అది నకిలీగా గుర్తించడం జరిగింది అని నివేదించాడు. ఇది ఐఫోన్ XS లాగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది Android యాప్ లతో వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నది. నకిలీ ఐఫోన్ వచ్చిన సంగతి ఫ్లిప్‌కార్ట్ యొక్క తన అకౌంట్ ద్వారా తెలుపగా నకిలీ ఐఫోన్‌ను త్వరలో భర్తీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ తన వైపు నుండి కుష్వాకు హామీ ఇచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంక వాట్సాప్ పని చేయదు... మీది ఉందేమో చూడండి

ఫ్లిప్‌కార్ట్ డెలివరీ గూఫ్-అప్స్

ఫ్లిప్‌కార్ట్ డెలివరీ గూఫ్-అప్స్

కస్టమర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒకదానిని ఆర్డర్ చేయడం మరియు మరొక దాన్ని పొందడం వంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. దీనికి మరొక ఉదాహరణగా ఈ నెల మొదట్లో విష్ణు సురేష్ అనే వ్యక్తికి కూడా ఇలానే జరిగింది. సురేష్ రూ.27,500 విలువైన కెమెరాను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేసాడు. కాని అతనికి దానికి బదులుగా ఒక పలకల బాక్స్ ను పొందాడు. పలకల ముక్కలతో పాటు బాక్స్ లో కెమెరా యొక్క మాన్యువల్ మరియు వారంటీ కార్డు కూడా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్
 

అదేవిధంగా గత సంవత్సరం ముంబైకి చెందిన ఇంజనీర్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఆపిల్ ఐఫోన్ 8 ను ఆర్డర్ చేసినందుకు దానికి బదులుగా సోప్ బార్ ను పొందాడు. గత సంవత్సరం యాక్టర్ నక్కుల్ కూడా ఇదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ నుండి కొత్త ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్‌ను ఆర్డర్ చేశాడు. కానీ అతనికి దీనికి బదులుగా నకిలీ ఐఫోన్ ను అందుకొని అతను కూడా మోసపోయాడు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart ships fake iPhone in Bangalore

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X