ఫ్లిప్‌కార్ట్ సూపర్ సేల్ వీక్, ఈ స్మార్ట్‌ఫోన్లపైనే భారీ తగ్గింపులు
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో 'సూపర్ వాల్యూ వీక్' పేరిట ఓ నూతన సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ఈ నెల 23నుంచి ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పలు కంపెనీలకు చెందిన ఫోన్
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో 'సూపర్ వాల్యూ వీక్' పేరిట ఓ నూతన సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ఈ నెల 23నుంచి ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పలు కంపెనీలకు చెందిన ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ముఖ్యంగా హానర్ తన కంపెనీకి చెందిన 10 ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తున్నది. సేల్‌లో భాగంగా హానర్ 9ఎన్, హానర్ 10 లైట్, హానర్ 7ఎ, 7ఎస్, హానర్ 9ఐ ఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.

అలాగే కేవలం రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు పలు ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఈ సేల్‌లో అందిస్తున్నారు. సేల్ వివరాలను పరిశీలిస్తే..

హానర్ 10 లైట్
3జిబి ర్యామ్ ఫోన్ అసలు ధర రూ.13,999, డిస్కౌంట్ రూ.2 వేలు, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.11,999
4జిబి ర్యామ్ అసలు ధర రూ.16,999, డిస్కౌంట్ రూ.3 వేలు, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.13,999
హానర్ 10 లైట్ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 9 లైట్
3జిబి ర్యామ్ ఫోన్ అసలు ధర రూ.13,999, డిస్కౌంట్ రూ.5,500, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.8,499
4జిబి ర్యామ్ అసలు ధర రూ.16,999, డిస్కౌంట్ రూ.7 వేలు, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.9,999
హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 9ఎన్
4జిబి ర్యామ్ అసలు ధర రూ.15,999, డిస్కౌంట్ రూ.6 వేలు, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.9,999
హానర్ 9ఎన్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఎ
3జిబి ర్యామ్ ఫోన్ అసలు ధర రూ.10,999, డిస్కౌంట్ రూ.3,500, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.7,499
హానర్ 7ఎ ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఎస్
2జిబి ర్యామ్ ఫోన్ అసలు ధర రూ.8,999, డిస్కౌంట్ రూ.3వేలు, డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.5,999
హానర్ 7ఎస్ ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








