ఫ్లిప్‌కార్ట్ మళ్లీ డిస్కౌంట్లను షురూ చేసింది

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ డిస్కౌంట్లను షురూ చేసింది.

|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ డిస్కౌంట్లను షురూ చేసింది. అమెజాన్ కి సవాల్ విసురుతూ ముందుకు తీసుకెళుతున్న ఈ దిగ్గజం ఆరు రోజుల క్రితమే బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌తో కస్టమర్లను ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సేల్‌కు ఫ్లిప్‌కార్ట్‌ తెరలేపింది. జూలై 23 నుంచి జూలై 29 వరకు సూపర్‌ వాల్యు వీక్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ సూపర్‌ వాల్యు వీక్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జత కట్టి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. దీనిలో భాగంగా మూడు, ఆరు, తొమ్మిది నెలల ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను ఎంపిక చేసుకున్న కస్టమర్లకు జీరో ఇంటరస్ట్‌ ఈఎంఐను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఆఫర్ల వివరాలపై ఓ లుక్కేయండి.

మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ ఎక్కువ సేపు రావడానికి సింపుల్ ట్రిక్స్మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ ఎక్కువ సేపు రావడానికి సింపుల్ ట్రిక్స్

హానర్‌ 9 లైట్‌

హానర్‌ 9 లైట్‌

ధర రూ.10,999
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలిచిన హానర్‌ 9 లైట్‌‌పై 3000 రూపాయల డిస్కౌంట్‌‌ను కంపెనీ ప్రకటించింది. అలాగే రూ.1500 మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ తో పాటు ఫోన్ ని బట్టి రూ.14వేల వరకూ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ సౌలభ్యం ఉంది. నెలకు రూ.625తో నో-కాస్ట్ ఈఎంఐ కూడా ప్రారంభమవుతోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ.10,999కే అందుబాటులో ఉంది.

హువావే హానర్ 9 లైట్ ఫీచర్లు

హువావే హానర్ 9 లైట్ ఫీచర్లు

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో ఎక్స్‌21
 

వివో ఎక్స్‌21

ధర రూ.35,990
వివో ఎక్స్‌21 స్మార్ట్‌ఫోన్‌ రూ.35,990కి ఇండియాలో లాంచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. నెలకు రూ.1500 నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ , 7000 రూపాయల మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌,ఎక్స్చేంజ్‌పై రూ.21వేల తగ్గింపు, యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా 5 శాతం తగ్గింపు లాంటి ఆఫర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

వివో ఎక్స్21 ఫీచర్లు

వివో ఎక్స్21 ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఒప్పో ఏ83

ఒప్పో ఏ83

ధర రూ. 13,990
3000 రూపాయల మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌తో ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ వాల్యు వీక్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నెలకు రూ.1,555తో నో-కాస్ట్‌ ఈఎంఐతో ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్‌పై రూ.13వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

ఒప్పో ఎ83 ఫీచర్లు

ఒప్పో ఎ83 ఫీచర్లు

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఎఫ్‌5 యూత్‌

ఒప్పో ఎఫ్‌5 యూత్‌

ధర రూ. 14,990
ఒప్పో ఎఫ్‌5 యూత్‌ స్మార్ట్‌ఫోన్‌పై 3000 రూపాయల వరకు మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ లభిస్తోంది. నెలకు రూ.1,666తో నో-కాస్ట్‌ ఈఎంఐ అందుబాటులో ఉంది. రూ.14వేల వరకు ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ లభ్యమవుతోంది.

ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు

ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్‌ 9ఐ

హానర్‌ 9ఐ

ధర రూ. 15,999
ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ వాల్యు వీక్‌లో హానర్‌ 9ఐ స్మార్ట్‌ఫోన్‌ రూ.15,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నెలకు రూ.667తో నో-కాస్ట్‌ ఈఎంఐ ప్రారంభమవుతుంది. రూ.15వేల వరకు ఎక్స్చేంజ్‌పై తగ్గింపు లభిస్తుంది. అదనంగా రెగ్యులర్‌ ఎక్స్చేంజ్‌ వాల్యులో వెయ్యి రూపాయల తగ్గింపు కూడా కస్టమర్లకు ఆఫర్‌ చేస్తుంది.

హానర్ 9ఐ 2018 ఫీచర్లు

హానర్ 9ఐ 2018 ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Flipkart Super Value Week: Discount and exchange offers on Honor 9 Lite, Vivo X21, Oppo A83 and more more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X