Home
News

షియోమీ ఫోన్‌ల అమ్మకాలను నిలిపివేసిన ఫ్లిప్‌కార్ట్

భారత్‌లో షియోమీ ఫోన్‌ల అమ్మకాలను నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో ఆ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న ఫ్లిప్‌కార్ట్ తదుపరి ఉత్తర్వులు అందే వరకు షియోమీ రెడ్‌మై నోట్, షియోమీ రెడ్‌మై 1ఎస్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

షియోమీ ఫోన్‌ల అమ్మకాలను నిలిపివేసిన ఫ్లిప్‌కార్ట్

భారత్ మార్కెట్లో అతితక్కువ కాలంలోనే అమితమైన ప్రజాదరణను సొంతం చేసుకున్న చైనా మొబైల్ ఫోన్‌ల కంపెనీ ‘షియోమీ'(Xiaomi) పై ఢిల్లీ హైకోర్ట్ బ్యాన్ విధించింది. భారత్‌లో షియోమీ ఫోన్‌ల విక్రయాలను నిలిపివేయాలంటూ షియోమీతో పాటు ఆ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎరిక్సన్ సంస్థకు చెందిన టెక్నాలజీ పేటెంట్ హక్కులను షియోమీ ఉల్లంఘిస్తోందన్న అభియోగాల నేపధ్యంలో ఈ తీర్పు వెలువరించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ ఉత్తర్వులో భాగంగా భారత్‌లో షియోమీ ఫోన్‌ల దిగుమతులను నిరోధించాలని కస్టమ్స్ అధికారులకు న్యాయస్థానం సూచించింది. అంతేకాకుండా, షియమీ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇప్పటి వరకు భారత్‌లో విక్రయించిన ఫోన్‌లకు సంబంధించి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయవల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. ఈ క్రమంలో షియోమీ, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలను పరిశీలించేందుకు ముగ్గురు స్థానిక కమీషనర్లను కోర్టు నియమించింది. వీరికయ్యే ఖర్చులను ఎరిక్సన్ సంస్థ భరించాలి. ఈ అంశానికి సంబంధించి నాలుగు వారల్లోపు నివేదికను కమీషనర్లు సమర్పించాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Flipkart Suspends Xiaomi Redmi Note, 1S Sales Until Further Notice. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X