‘రేపటి వరకు ఆగండి, అసలు డీల్స్ మొదలవుతాయ్’, అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ పంచ్!

ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య యుద్ధం రాజుకుంది. సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో ఈ రెండు సంస్థల మధ్య హోరాహోరి వార్ నుడుస్తోంది.

‘రేపటి వరకు ఆగండి, అసలు డీల్స్ మొదలవుతాయ్’, ఫ్లిప్‌కార్ట్ పంచ్!

నేటి నుంచి ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఉద్దేశిస్తూ ఫ్లిప్‌కార్ట్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది.

Read More : Redmi 3S Prime ధర తగ్గింది, రూ.3000 వరకు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ ఆన్‌లైన్ షాపర్లను ఉద్దేశిస్తూ.

ఇండియన్ ఆన్‌లైన్ షాపర్లను ఉద్దేశిస్తూ.. ‘హాంగ్ ఆన్ ఇండియా. అక్టోబర్ 2 నుంచి మొదలు కాబోతున్నభారతదేశపు అతిపెద్ద సేల్ అయిన #BigBillionDaysలో అసలు సిసలైన డీల్స్ ప్రారంభం కాబోతున్నాయ్' అంటూ ఫ్లిప్‌కార్ట్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేస్తుంది.

అమెజాన్‌ను టార్గెట్ చేస్తూ..

ఈ రోజు నుంచి ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసే షాపర్లను దృష్టిలో ఉంచుకుని ప్లిప్‌కార్ట్ ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసినట్లు స్ఫష్టమవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌

మరోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అక్టోబర్ 2 అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.

No-cost EMI, Product Exchange ఆఫర్స్..

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్ నేటి అర్ధరాత్రి ప్రారంభమై 6వ తేదీతో ముగుస్తుంది. ఈ 5 రోజుల సేల్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపర్లను ఆకర్షించేందుకు No-cost EMI, Product Exchange వంటి ఆసక్తికర ఆఫర్లకు ఫ్లిప్‌కార్ట్ తెరలేపింది.

యాపిల్‌తో ఒప్పందం..

ఇప్పటికే యాపిల్‌తో ఒప్పందం కదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

గతేడాది కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య ట్విట్టర్ వార్

గతేడాది కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఫ్లిప్‌కార్ట్ ఆఫీసులో అమెజాన్ డెలివరీ బాక్సును చూపిస్తూ రెడ్డిట్ ఇండియాలో "Even @Flipkart orders from @Amazon!" ఓ ఫోటోతో కూడిన పోస్ట్ వెలువడింది.

ఆ పోస్ట్ పై ధీటుగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్..

ఈ పోస్ట్ పై ధీటుగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్ ఆ ప్యాకేజీని రిసిప్షన్‌లో డస్ట్‌బిన్ క్రింద వాడుతున్నామని కౌంటర్ కిక్ ఇచ్చింది. దీనికి రిప్లై ఇచ్చిన అమెజాన్ "There is a bit of Amazon in every e-commerce company." అంటు బదులిచ్చింది. తాజాగా ఫ్లిప్ కార్ట్ చేసిన ట్వీట్ కు అమెజాన్ ఏ విధంగా కౌంటర్ ఇస్దుందో చూడాలి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart takes a dig at Amazon India's sale on Twitter. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot