అమెజాన్ అసలైన సవాల్ విసరనున్న ఫ్లిప్‌కార్ట్
ఈ కామర్స్ రంగంలో తలపడుతున్న దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నాయి.
ఈ కామర్స్ రంగంలో తలపడుతున్న దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కస్టమర్లు అనేక లాభాలను పొందనున్నారు. పలు ప్రత్యేకమైన సేల్స్ నిర్వహించినప్పుడు ఆ సేల్స్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఇదే బాటలో ఫ్లిప్‌కార్ట్ కూడా నడవనుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా..
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా ఉచిత డెలివరీలు, వేగవంతమైన డెలివరీలు లభిస్తాయి. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ యాప్‌లలో ఉచితంగా వీడియోలు చూడవచు. మ్యూజిక్ వినవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఫ్లిప్‌కార్ట్ కూడా..
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ నెల 15వ తేదీన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ పేరిట ఓ నూతన ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రోగ్రామ్‌లో..
ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రోగ్రామ్‌లో కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ తరహాలోనే బెనిఫిట్స్ లభిస్తాయి. పలు ప్రత్యేకమైన సేల్స్ నిర్వహించినప్పుడు ఆ సేల్స్‌తోపాటు వాటిల్లో డీల్స్ ముందుగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు లభిస్తాయి.

ఉచితమైన, వేగవంతమైన డెలివరీలు..
ఇక ఉచితమైన, వేగవంతమైన డెలివరీలు కూడా లభిస్తాయి. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే కస్టమర్లు నెలవారీ లేదా, వార్షిక రుసుము చెల్లించాలి. కానీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అలా కాదు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐటమ్స్‌ను..
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ కావాలంటే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఐటమ్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేయాలి.

రిడీమ్ ..
దీంతో వారికి ప్లస్ కాయిన్స్ లభిస్తాయి. వాటిని రిడీమ్ చేసుకుని ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లుగా అందులో ఉండే బెనిఫిట్స్‌ను పొందవచ్చు.

పూర్తి వివరాలను..
అయితే ఈ ప్రోగ్రామ్ గురించిన పూర్తి వివరాలను మాత్రం ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. కానీ త్వరలోనే వాటి గురించి తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








