భారీ ఆఫర్లతో రానున్న Flipkart అమ్మకాలు ఇవే ! మొదలయ్యే తేదీలు చూడండి.

By Maheswara
|

పండగలు, హాలిడేలు మరియు సీజన్ ల సందర్భాన్ని బట్టి ధరల తగ్గింపు మరియు వివిధ రకాల వస్తువులపై డిస్కౌంట్ లను ప్రకటించే విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ ట్రెండింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఈ ఇ-కామర్స్ షాపింగ్ సైట్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా అమ్మకాన్ని నిర్వహించింది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర గాడ్జెట్‌లతో సహా అనేక వస్తువులను డిస్కౌంట్ ధరలకు కొనే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మకాలు పూర్తి అయ్యాయి. తదుపరి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల కోసం ఆసక్తిగా ఉన్నాము.

 

తదుపరి ఫ్లిప్‌కార్ట్ అమ్మకం ఎప్పుడు?

తదుపరి ఫ్లిప్‌కార్ట్ అమ్మకం ఎప్పుడు?

మన లాంటి ఆసక్తిగల వారందరు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. నిజమే, దీపావళి ముగిసింది. కానీ, షాపింగ్ చేయడానికి మరియు పండగలు జరుపుకోవడానికి మనకు ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో అనేక ఇతర అమ్మకాలను ప్రకటిస్తోంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ అమ్మకపు తేదీలు మరియు వివరాల జాబితా ఇక్కడ ఇస్తున్నాము.

Flipstart Days Sale

Flipstart Days Sale

ఫ్లిప్‌కార్ట్ త్వరలో 'ఫ్లిప్‌స్టార్ట్ డేస్' అమ్మకాన్ని నిర్వహించనుంది. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ అమ్మకాలు  డిసెంబర్ 1 న జరగాల్సి ఉంది, మరియు డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఈ అమ్మకాల గురించి  ఖచ్చితమైన వివరాలు విడుదల కానప్పటికీ, ఏదేమైనా, ఇది డిసెంబర్ మొదటి అమ్మకం అవుతుంది మరియు గాడ్జెట్‌లతో సహా అనేక వస్తువులపై ధరల తగ్గింపును అందిస్తోంది.

Also Read: Poco M3 కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నది!!! ధర ఎంతో తెలుసా??Also Read: Poco M3 కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నది!!! ధర ఎంతో తెలుసా??

Flipkart TV Days Sale
 

Flipkart TV Days Sale

పేరు సూచించినట్లుగా, ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ అమ్మకం,  స్మార్ట్ టీవీలకు అంకితం చేయబడింది. దీపావళి అమ్మకంలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు కోల్పోయినట్లయితే, మీరు డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 18 వరకు ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ అమ్మకంలో ఆఫర్లు మరియు ధరల తగ్గింపు తో టీవీ లను కొనవచ్చు.

Flipkart Year End Sale

Flipkart Year End Sale

ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ అమ్మకం తరువాత ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ అమ్మకం జరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలో ఒకటి కావచ్చు. ఎందుకంటే ఇది విస్తృత శ్రేణి వస్తువులపై చాలా తగ్గింపులను తెస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ అమ్మకం మొబైల్ బెస్ట్ సెల్లర్లలో అతి తక్కువ ధరను అందిస్తుందని భావిస్తున్నారు. ఇది ప్రత్యర్థి అమెజాన్‌తో పోటీని కూడా పెంచుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది.

Flipkart Jingle Days Sale

Flipkart Jingle Days Sale

ఫ్లిప్‌కార్ట్ జింగిల్ డేస్ అమ్మకం సంవత్సరం ముగిసేలోపు భారతీయ మార్కెట్లో చివరి అమ్మకం అవుతుంది. పేరు సూచించినట్లుగా, ఫ్లిప్‌కార్ట్ జింగిల్ డేస్ అమ్మకం క్రిస్మస్ సందర్భంగా, ఇది డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 29 వరకు జరగనుంది. 2020 చివరి అమ్మకం వలె, ఫ్లిప్‌కార్ట్ జింగిల్ డేస్ అమ్మకం స్మార్ట్ గాడ్జెట్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపును అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Upcoming Sale Dates And Offers On Electronic Gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X