ది ఫ్లిప్‌హార్ట్‌ డే పేరిట ఫ్లిప్‌కార్ట్‌‌లో 80 శాతానికి పైగా డిస్కౌంట్లు !

Written By:

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వాలెంటైన్స్ డే సంధర్భంగా భారీ ఆఫర్లతో దూసుకొస్తోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' సేల్‌ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. సర్‌ప్రైజ్‌లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 14 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' ఆఫర్‌లో సైన్‌-అప్‌ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్‌, హోమ్‌ డెకర్‌లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

వాట్సప్ నుంచి పేమెంట్లు చేసేయండి, ఎలా చేయాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌ బ్యాంకులు..

ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్‌ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్‌ చేయలేదు.

మొబైల్‌ ఫోన్లపై కూడా..

కాగా మొబైల్‌ ఫోన్లపై కూడా 'గ్రేట్‌ డీల్స్‌' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్‌, స్పోర్ట్స్‌, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు..

టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్‌, డెకర్‌, ఫర్నీషింగ్‌ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్‌ డీల్స్‌' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనాన్ని అదుపులో పెట్టుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

ముందుగా మీరు ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకు చేస్తున్నారో మీలో మీరే ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. అవసరమనుకుంటేనే షాపింగ్ కు ఉపక్రమించండి లేదనుకుంటే విరమించుకోండి.

2.

షాపింగ్ వ్యాపకాన్ని మరిచిపోయేందుకు ఎక్కువ దూరం నడవండి. వ్యాయమం చేయండి. డిస్కౌంట్ ధరల్లో వచ్చేస్తున్నాయి కదా అని డజన్ల కొద్ది డీల్స్‌ను ఓకే చేసేయకుండా అవసరానికి అనుగుణంగా వ్యవహరించండి.

3

మీ మీ బ్యాంక్ ఖాతాలలో పరిమితి స్థాయిలో నగదును ఉంచుకోవటం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనాన్ని నియంత్రించుకోవచ్చు.ఆన్‌లైన్ షాపింగ్ చేసే కమ్రంలో ఓ మిత్రుడిని మీ వెంట ఉంచుకోండి. ఒక వేళ మీరు పరిధి దాటితే అతడు మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు.

ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనం..

ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Valentine's Day offers': To offer discounts up to 80% on laptops, cameras and more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot