Home
News

వాలంటైన్స్‌ డే స్పెషల్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్‌ ఆఫర్లు..!

ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా మొబైల్ బోనాంజా పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. వాలంటైన్స్‌ డే 2024 సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇప్పటికే ఈ సేల్‌ ప్రారంభం అవ్వగా.. ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. అనేక స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తోంది. మోటోరోలా, వివో, శాంసంగ్‌, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చు.

ఇటీవల విడుదల అయిన మోటో G24 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్ బోనంజా సేల్‌లో (Flipkart Mobile Bonanza Sale 2024) కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ Mail G52 MP2 GPUతో జతచేయబడుతుంది.

flipkart valentines day special sale 2024

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. మరియు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. IP52 వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,249 కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు ఇటీవల విడుదలైన రియల్‌మి 12 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.29,999 కు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 CPU మరియు అడెన్నో 710 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

flipkart valentines day special sale 2024

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంది.

* ఈ రెండు స్మార్ట్‌ఫోన్లతోపాటు మోటోరోలా ఎడ్జ్‌ నియో 40 హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.21,999 కు కొనుగోలు చేయవచ్చు. వినో T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.21999 కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ S21 SE మోడల్‌ను రూ.28,999 కు సొంతం చేసుకోవచ్చు.

ఈ ప్రీమియం ఫోన్లతోపాటు బడ్జెట్‌ రేంజ్‌ మోడల్‌ను కూడా ఫ్లిప్‌కార్టు సేల్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 11X 5G ధర రూ.12,499, రెడ్‌మి 12 5G రూ.11,999, పోకో M6 ప్రో 5G ధర రూ.10,499, మోటో G34 5G రూ.10,999, వివో T2x 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.11,249 ధరకు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F04 రూ.5,999 గా ఉంది. ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 8 ఫోన్‌ను అన్ని ఆఫర్లతో కలిపి ధర రూ.6,389 గా ఉంది. రియల్‌మి C53 స్మార్ట్‌ఫోన్‌ను రూ.89999 కే కొనుగోలు చేయవచ్చు, పోకో M5 5G హ్యాండ్‌సెట్‌ను రూ.9,499 కే ఫ్లిప్‌కార్టు మొబైల్స్ బోనంజా సేల్‌లో (Flipkart mobile bonanza sale 2024) కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart mobile bonanza sale offers best offers on smartphones 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X