Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ 2025.. రేపటి నుంచి 10 రోజులపాటు..!

Flipkart Big Billion days 2025 : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌, ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్లు 24 గంటలకు ముందే ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. క్రమంగా ఈ సేల్‌ డీల్స్‌, బ్యాంకు ఆఫర్లు సహా మరిన్ని వివరాలను వెల్లడవుతున్నాయి.

10 శాతం డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా యాక్సెస్‌, ICICI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని ఇప్పటికే వెల్లడయింది. అయితే ఈ సేల్‌ ఎన్నిరోజులపాటు నిర్వహించే వీలుందనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి.

Flipkart Big Billion days 2025

దీని ఆధారంగా రేపటి నుంచి (సెప్టెంబర్ 8) స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్ల వారీగా డీల్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. ఇందులో బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ల వరకు అనేక వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. తేదీల వారీగా బ్రాండ్స్‌ డీల్స్‌ వెల్లడించనున్నారు. రేపటి నుంచి 10 రోజులపాటు డీల్స్‌ వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇన్ఫినిక్స్‌ - సెప్టెంబర్‌ 8
గూగుల్‌ - సెప్టెంబర్‌ 10
ఆపిల్ - సెప్టెంబర్‌ 11
మోటోరోలా - సెప్టెంబర్‌ 12
రియల్‌మి - సెప్టెంబర్‌ 13
నథింగ్‌ ఫోన్‌ - సెప్టెంబర్‌ 14
పోకో - సెప్టెంబర్‌ 15
శాంసంగ్ - సెప్టెంబర్‌ 16
ఒప్పో - సెప్టెంబర్‌ 17
వివో - సెప్టెంబర్‌ 18
టెక్నో - సెప్టెంబర్‌ 19

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన బిగ్‌ బిలియన్ డేస్‌ 2025 సేల్‌ కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ ను రూ.40 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. అదే నథింగ్‌ ఫోన్‌ 3, ఐఫోన్‌ 16 మోడల్స్‌ కూడా భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి రానున్నాయి.

వీటితోపాటు అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ సహా ఇతర గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలను తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. టిప్‌స్టర్‌ ముకుల్ శర్మ ఇటీవల తెలిపిన వివరాల ఆధారంగా ఏ స్థితిలో ఉన్న ఫోన్‌ను అయినా ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌లో ఎక్స్చేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

అమెజాన్‌ సేల్‌ :
మరో ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ 2025 కూడా సెప్టెంబర్ 23 నుంచే ప్రారంభం కానుంది. ప్రైమ్‌ మెంబర్లు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. SBI కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చని అమెజాన్ తెలిపింది.

ఎన్నిరోజులపాటు ఈ సేల్ జరగనుందో వెల్లడి కాలేదు. ఈ సేల్‌లో భాగంగా 8PM స్పెషల్స్‌, ట్రెండింగ్‌ డీల్స్‌, బ్లాక్‌బస్టర్‌ ఎక్స్ఛేంజీ వంటి అనేక డీల్స్‌ను అందించనుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 6, వన్‌ప్లస్‌ 13 సిరీస్‌, ఐకూ 13 5G వంటి మోడల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Flipkart will announce brand wise deals for Big Billion days 2025 sale from september 8
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X