200MP కెమెరా Redmi ఫోన్‌పై బెస్ట్ డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి నోట్ 13 సిరీస్ త్వరలో (Redmi Note 13) లాంచ్ కానుంది. దీంతో రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. షియోమీ క్రిస్మస్ సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ వింట్ ఫెస్ట్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ధరను అందిస్తోంది. బ్యాంకు మరియు ఎక్స్చేంజీ ఆఫర్లతో పాటు అదనంగా రూ.6000 తగ్గింపును పొందవచ్చు.
రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ ధర రూ.30,999గా ఉంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ వైట్, ఐస్‌బర్గ్ బ్లూ, ఒబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

Mi.com వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్‌లో భాగంగా Mi ఫోన్ల ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.3000 అదనంగా తగ్గింపును పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ అండర్ ది హుడ్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 1080 CPU మరియు ARM Mail-G68 MC4 GPU పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 పైన పనిచేస్తుంది.
నోట్ 12 ప్రో ప్లస్ 129W హైపర్ ఛార్జ్ ఛార్జింగ్ సపోర్టుతో 4,980mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2 మరియు USB-C పోర్టు మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ ఈ నెల 23న ప్రారంభం కాగా... ఈ నెల 31వరకు ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర గృహోపకరణాలపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. హెడ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డు ద్వారా చెల్లింపులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








