70 వేల Pixel 2 స్మార్ట్‌ఫోన్ రూ.11 వేలకే, ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్

|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా flipkarts-super-value-week పేరిట మరో సేల్‌కు తెరలేపింది. ఈ నెల 24 వరకు జరగనున్న ఈ సేల్‌లో కొనుగోలు దారులు రూ.70 వేల ఫోన్ ని రూ.11 వేలకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే ఈ సేల్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్లపై నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్‌ గ్యారెంటీలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. గూగుల్‌ పిక్సెల్‌ 2, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8 ప్లస్‌, మోటో ఎక్స్‌4 వంటి పాపులర్‌ మొబైల్‌ ఫోన్లను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది.

 

సెల్ఫీ కెమెరా విభాగంలో దుమ్మురేపుతున్న Vivo X21సెల్ఫీ కెమెరా విభాగంలో దుమ్మురేపుతున్న Vivo X21

బైబ్యాక్‌ గ్యారెంటీ

బైబ్యాక్‌ గ్యారెంటీ

సూపర్‌ వాల్యు వీక్‌ సేల్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌‌లో 128 జీబీ మోడల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌‌ను బైబ్యాక్‌ గ్యారెంటీతో కేవలం 10,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 70వేల రూపాయలు.

రూ.199తో బైబ్యాక్‌ గ్యారెంటీ పాలసీ

రూ.199తో బైబ్యాక్‌ గ్యారెంటీ పాలసీ

ఈ ఆఫర్‌ పొందాలంటే, వినియోగదారులు తొలుత రూ.199తో బైబ్యాక్‌ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

9,001 రూపాయల డిస్కౌంట్‌

9,001 రూపాయల డిస్కౌంట్‌

ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో పిక్సెల్‌ 2 ఫోన్‌ ధర 60,999 రూపాయలకు దిగొచ్చింది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు
 

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు

అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా మరో 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌తో పిక్సెల్‌ 2 ధర రూ.52,999కు తగ్గింది.

రూ.42 వేల ఎక్స్చేంజ్‌

రూ.42 వేల ఎక్స్చేంజ్‌

వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో రూ.42 వేల ఎక్స్చేంజ్‌ వాల్యును కొనుగోలు దారులను పొందుతారు. ఇలా పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,999కు పడిపోయింది.

 

రూ.37 వేల బైబ్యాక్‌ గ్యారెంటీ

రూ.37 వేల బైబ్యాక్‌ గ్యారెంటీ

పిక్సెల్‌ 2, 128 జీబీ వేరియంట్‌పైనే కాక, ఫ్లిప్‌కార్ట్ తన పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ 64 జీబీ మోడల్‌పై కూడా రూ.37 వేల బైబ్యాక్‌ గ్యారెంటీని ఆఫర్‌ చేస్తోంది. 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ.44 వేల బైబ్యాక్‌ను అందిస్తోంది.

మోటో ఎక్స్‌4కు కూడా..

మోటో ఎక్స్‌4కు కూడా..

ఇదే రకమైన ఆఫర్‌ను మోటో ఎక్స్‌4కు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్‌4 స్మార్ట్‌ఫోన్‌ రూ.6999కు లభ్యమవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ అసలు ధర 22,999 రూపాయలు.

ఈజీ నో కాస్ట్‌ ఈఎంఐ

ఈజీ నో కాస్ట్‌ ఈఎంఐ

బైబ్యాక్‌ గ్యారెంటీతో పాటు , ఫ్లిప్‌కార్ట్‌ పలు స్మార్ట్‌ఫోన్లపై ‘ఈజీ నో కాస్ట్‌ ఈఎంఐ' ను కూడా ఆఫర్‌ను చేస్తోంది. మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక సైట్లో సందర్శించగలరు.

ఫీచర్లు

ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు
6 అంగుళాల డిస్‌ప్లే,4జీబీ ర్యామ్‌,64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ,ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌,8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా,12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Best Mobiles in India

English summary
Flipkart's Super Value Week: Pixel 2 available at an effective price of Rs. 10,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X