ఫ్లిప్‌స్టార్ట్ డేస్ 2020 సేల్స్ ఆఫర్స్ అదుర్స్...

|

ఇప్పుడు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క శుభసందర్బంగా ఫ్లిప్‌కార్ట్ తన ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్స్ పేరుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. మూడు రోజులపాటు జరిగే ఈ సేల్స్ జనవరి 1 అర్ధరాత్రి నుండి మొదలైనాయి అలాగే ఈ సేల్స్ జనవరి 3 వరకు కొనసాగుతాయి. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్స్ సమయంలో ఆఫర్లను అందిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్
 

ఆన్‌లైన్ సేల్స్ కోసం జనాదరణ పొందిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఎటువంటి ఖర్చులేకుండా EMI పేమెంట్ ఎంపికతో అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పొడిగించిన వారంటీ మరియు ఎంచుకున్న ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్‌ల రూపంలో అధిక ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఎంచుకున్న డెబిట్ కార్డులతో ఫ్లిప్‌కార్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తుంది.

ఆధార్-పాన్ లింకింగ్ గడువును మళ్ళీ పొడగించిన ITశాఖ

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్స్

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అన్ని రకాల ఆఫర్లను పరిశీలించడానికి కంపెనీ తన వెబ్‌సైట్‌లో అమ్మకం కోసం ల్యాండింగ్ పేజీని ఏర్పాటు చేసింది. సంస్థ అందిస్తున్న మరిన్ని ఆఫర్ల కోసం అధికారిక పేజీని ఓపెన్ చేసి చూడవచ్చు.

ఇ-కామర్స్ రంగంలోకి "జియోమార్ట్" పేరుతో అమెజాన్ కు పోటీగా రిలయన్స్ జియో

రాయితీ ధర

ఈ అమ్మకంలో భాగంగా బోట్‌, జెబిఎల్, సోనీ మరియు ఇతరుల హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్లను ఫ్లిప్‌స్టార్ట్ డే సేల్స్ సందర్భంగా 70 శాతం వరకు తగ్గింపు ధరతో పొందవచ్చు. ఒకవేళ మీరు నూతన సంవత్సర పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రాయితీ ధర వద్ద అన్ని రకాల మొబైల్ ఫోన్లను మరియు వాటి యొక్క కవర్లను పొందవచ్చు.

Rs.400 బడ్జెట్‌ ధరలో లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న టెల్కోలు

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ 2020
 

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్స్ లో ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జిబి గ్రాఫిక్స్) ను రూ. 44,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ ల్యాప్‌టాప్ యొక్క ధర రూ.50,000. ఎసెర్ స్విఫ్ట్ 3 8 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి 8 జిబి ర్యామ్ మద్దతు ఉంది. ఇది 512GB ఎస్‌ఎస్‌డితో వస్తుంది మరియు విండోస్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ 2020 సేల్స్

అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యొక్క ఫ్లిప్‌స్టార్ట్ డేస్ 2020 సేల్స్ లో టీవీలు మరియు గృహోపకరణాల మీద 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండెడ్ ఉత్పత్తులను ఈ సేల్స్ సమయంలో 80 శాతం వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipstart Days 2020 Sale Live on Flipkart: Check Offers on Laptops, TVs, Home Appliances and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X