త్వరలో మార్కెట్‌‌లోకి ఏడు వేలకే ఫ్లయ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్

Posted By: Super

త్వరలో మార్కెట్‌‌లోకి ఏడు వేలకే ఫ్లయ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్

భారతదేశంలో అది అడుగు పెట్టినప్పుడు మైక్రోమ్యాక్స్. ఆ తర్వాత దాని పేరు నిదానంగా ఫ్లయ్ గా మారిపోయింది. ఏంటా ఇదంతా అని అనుకుంటున్నారా అదేనండి ప్రస్తుతం మనం ప్లయ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. త్వరలో ప్లయ్ మొబైల్ కంపెనీ ఇండియాలోకి నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్స్‌‌ని ప్రవేశపెట్టనుంది. ఫ్లయ్ కంపెనీ ప్రవేశపెట్టనున్నటువంటి ఈ మొబైల్స్ దాదాపు పదహేను వేల రూపాలయలలోపులోనే ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్ లోకి శ్యామ్ సంగ్, ఎల్‌‌జి, హెచ్‌‌టిసి కంపెనీలు ఆండ్రాయిడ్ ఆపరెటింగ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి వాటి స్మార్ట్ పోన్స్‌ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో తక్కువ ఖరీదు కలిగినటువంటి ఆండ్రాయిడ్ పోన్స్‌ని హావాయి కంపెనీ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఇండియాలో ఉన్నటువంటి మొబైల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోని చాలా కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. లండన్‌కి సంబంధించినటువంటి కంపెనీ అయినటువంటి ప్లయ్ త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో నాలుగు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్స్ ఖరీదు విషయానికి వస్తే రూ 7000 నుండి రూ 10000లోపే ఉండవచ్చునని అంటున్నారు. తక్కవ ఖరీదు కదా ఇందులో ఆప్షన్స్ ఏమి ఉండవు అనుకుంటే పోరపాటు పడినట్లే. ఫ్లయ్ కంపెనీ ముందుగా చెప్పినట్లు ఈ నాలుగు ఫోన్స్‌ లలో 5మోగా పిక్సల్ కెమెరాతోపాటు, ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం ఇండియాలో అంతా 3జి మయం. ఈ సంవత్సరం చివరి కల్లా 3జి ఇంకా జనాభాలోకి చోచ్చుకుపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోవడం వల్లనే ఇప్పడు ప్లయ్ కంపెనీ నాలుగు మొబైల్స్‌ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే త్వరలో మన దేశంలో తక్కువ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్స్ దర్శనమివ్వనున్నాయన్నమాట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot