ఆకాశంలో ఎగిరే రైళ్లు వస్తున్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ మాయ

మనం ఎన్నో హాలీవుడ్ సినిమాలలో ఆకాశంలో ఎగిరే కార్లు చిత్ర విచిత్ర ఫ్లైట్లు చూస్తుంటాం. అస్సలు ఇవి నిజమేనా కార్లు కూడా ఇలా ఎగరగలవా ఇలాంటివి తాయారు చేయడం సాధ్యమా అని ఆశ్చర్యానికి లోనవుతుంటాం.

By Anil
|

మనం ఎన్నో హాలీవుడ్ సినిమాలలో ఆకాశంలో ఎగిరే కార్లు చిత్ర విచిత్ర ఫ్లైట్లు చూస్తుంటాం. అస్సలు ఇవి నిజమేనా కార్లు కూడా ఇలా ఎగరగలవా ఇలాంటివి తాయారు చేయడం సాధ్యమా అని ఆశ్చర్యానికి లోనవుతుంటాం . రోజు రోజుకి వస్తున్న కొత్త టెక్నాలజీ ను చూస్తే అవును ఇది నిజమే అనిపిస్తుంటుంది.ఇప్పుడు లేటెస్ట్ గా ఆకాశంలో ఎగిరే రైళ్లు కూడా రాబోతున్నాయి. ఫ్రాన్స్‌ దేశం కంపెనీ అయిన Akka టెక్నాలజీస్‌ ఈ ఎగిరే రైళ్లను తయారుచేయబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే....

Akka టెక్నాలజీస్‌ సంస్థ....

Akka టెక్నాలజీస్‌ సంస్థ....

ఫ్రాన్స్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న Akka టెక్నాలజీస్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో గుండ్రని రైలు ఆకారంలో ప్రయాణికులు కూర్చోవడనికి ఓ ట్యూబ్‌ ఉంటుంది. దాన్ని ఓ చక్రాల వాహనం రన్‌వేలో గద్దలా ఆగిన విమానం కిందకు తీసుకొస్తుంది. ఆ విమానానికి రెక్కలు తప్ప బాడీ ఉండదు. చక్రాల బండి మీద తీసుకొచ్చిన రైలును విమానానికి అటాచ్‌ చేస్తారు. అది దాన్ని మోసుకొని గమ్యస్థానానికి వెళుతుంది.

 ప్రముఖ కంపెనీలు ఈ  ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి...

ప్రముఖ కంపెనీలు ఈ ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి...

Akka టెక్నాలజీస్‌తో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి. ఈ ఎగిరే రైళ్లు ప్రాజెక్ట్‌ పూర్తయితే రైల్వే వ్యవస్థలోనే పిప్లవాత్మక మార్పులు వస్తాయని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్యూబ్‌ లాంటి రైళ్లు రైల్వే స్టేషన్ల వద్ద ఉంటాయని, వాటిని ఎగిరే విమానాలు వచ్చి తీసుకొని వెళతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

త్రీడీ వీడియోగా...

త్రీడీ వీడియోగా...

ఈ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రసిద్ధ చెందిన కంపెనీలను ఆహ్వానించగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్సాహం చూపించినట్లు కంపెనీ సీఈవో మారిస్‌ రిక్కీ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ కాన్సెప్ట్‌ను కంపెనీ త్రీడీ వీడియోగా రూపొందించింది.

రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుంది....

రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుంది....

ఈ ఫ్లయింగ్ రైళ్లతో రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుందని, ప్రయాణికుడు తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో దిగే సౌకర్యం వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Best Mobiles in India

English summary
Akka Technologies’s new flagship aircraft design, with wings that come off to hasten turnover at airports and make boarding easier and closer to passengers’ homes.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X