ఎగిరే Uber cabs వస్తున్నాయ్, ఇకపై ఆకాశ దేశ ప్రయాణం !

By Hazarath
|

ప్రస్తుతం ఉబర్ క్యాబ్ లు వినియోగదారులకు చాలా దగ్గరైన విషయం తెలిసిందే. అర్జెంట్ గా ఏదైనా పని మీద వెళ్లాలన్నా ముందుగా అందరూ ఉబర్ క్యాబ్ వైపే చూస్తారు. అయితే ఉబర్‌ క్యాబ్‌లకు అంతకంతకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి, మరికొన్నేళ్లలో ఉబర్‌ సరికొత్త సర్వీసులను ప్రారంభించబోతుంది.

 

అపరిమిత డేటాతో వొడాఫోన్ సరికొత్త ప్లాన్లు !అపరిమిత డేటాతో వొడాఫోన్ సరికొత్త ప్లాన్లు !

ఆకాశంలో ప్రయాణించడానికి..

ఆకాశంలో ప్రయాణించడానికి..

ఇప్పటిదాకా ఉబర్ క్యాబ్‌లో ప్రయాణం అంటే నేలమీదనే సాగేది. అయితే ఇకపై ఆకాశంలో ప్రయాణించడానికి కూడా ఉబర్‌ క్యాబ్‌ సర్వీసులను మొదలు పెట్టబోతుంది.

2024 వరకు వాణిజ్య అవసరాల కోసం..

2024 వరకు వాణిజ్య అవసరాల కోసం..

2023 వరకు చెల్లింపులతో ఎగిరే ట్యాక్సి సర్వీసులను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఉబర్‌ ప్రణాళికలు కనుక విజయవంతమైతే, 2024 వరకు వాణిజ్య అవసరాల కోసం క్యాబ్‌లోనే ఎగురవచ్చు.

గత నెలలో ఈ విషయంపై క్లారిటీ..

గత నెలలో ఈ విషయంపై క్లారిటీ..

ఎంబ్రేర్ ఎస్‌ఏతో పాటు ఉబర్‌ టెక్నాలజీస్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తోందని బ్రెజిలియన్‌ ప్లేన్‌ మేకర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. కాగా ఉబర్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జెఫ్‌ హోల్డెన్‌ కూడా గత నెలలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఐదు నిమిషాల వ్యవధిలో..
 

ఐదు నిమిషాల వ్యవధిలో..

విమానాల మధ్య ఐదు నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయగల బ్యాటరీలతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు రూపొందుతోంది. ఫ్లయింగ్ ఉబర్‌ ట్యాక్సీల ఏర్పాటుకి అనుగుణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని ఏర్పరచడానికి నాసాతో కూడా ఉబర్ ఓ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎగిరే క్యాబ్ వల్ల ఎన్నో సమస్యలు..

ఎగిరే క్యాబ్ వల్ల ఎన్నో సమస్యలు..

అయితే ఈ ప్రాజెక్ట్ అంత సులువు కాదని.. ఎగిరే క్యాబ్ వల్ల ఎన్నో సమస్యలు రావచ్చునని నిపుణులు అంటున్నారు.

ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్‌లో శిక్షణ..

ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్‌లో శిక్షణ..

ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన పైలెట్లను నియమించాల్సి ఉంటుందని.. లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్‌లో శిక్షణనివ్వాల్సి వస్తుందని తెలిపారు. వీటితో పాటు బ్యాటరీ టెక్నాలజీలో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Flying Uber cabs may be a reality by 2024 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X