Home
News

Foldable Phones vs Smartphones: ఇందులో ఏవి ఉపయోగకరంగా ఉన్నాయి...

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజు రోజుకి అధికమవుతున్నది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రతి రెండు నెలలకు ఒక కొత్త ‌ఫోన్‌ను సరికొత్త టెక్నాలజీలతో అప్ గ్రేడ్ అవుతూ విడుదల చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ ‌విభాగంలో ఇప్పటికే హువాయి, మోటరోలా, శామ్సంగ్ వంటి సంస్థలు ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసాయి. అయితే 2021 సంవత్సరంలో ఒప్పో, వివో, షియోమి, TCL, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కొత్తగా ఫోల్డబుల్ ఫోన్‌లను సరికొత్త టెక్నాలజీలతో విడుదల చేసే పనిలో ఉన్నట్లు ఇప్పటికే టీజర్ లను కూడా విడుదల చేసాయి.

ఫోల్డబుల్ ఫోన్‌లు vs స్మార్ట్‌ఫోన్‌ల ధరల పోలికలు

ఫోల్డబుల్ ఫోన్‌లు vs స్మార్ట్‌ఫోన్‌ల ధరల పోలికలు

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో బడ్జెట్ ధరలో కూడా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే ఒప్పో, వివో, షియోమి సంస్థలు 2021లో ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. అయితే ఈ సంస్థలు రూ.20,000 లోపు ధరలో 5G ఫీచర్లతో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల విడుదల చేసాయి. ఇండియాలో ఎక్కువ మంది 10 వేల నుంచి 15వేల లోపు ధరలో కొత్త ‌ఫోన్‌లను కొనడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదల అయిన ఫోల్డబుల్ ఫోన్‌లు అన్ని కూడా అధిక ధరను మాత్రమే కలిగి ఉన్నాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ విడుదల చేసిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్ ఫోన్లు 30 వేలకు పైన ధరను కలిగి ఉన్నాయి.

ఫోల్డబుల్ ఫోన్‌లు vs స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్

ఫోల్డబుల్ ఫోన్‌లు vs స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్

అన్ని సంస్థలు ఫోల్డబుల్ ఫోన్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపుగా ఒకే రకమైన ఫీచర్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభించే ఫోన్లలో కూడా సరికొత్త స్నాప్‌డ్రాగన్ మరియు మీడియాటెక్ సంస్థల చిప్ సెట్ లను ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కూడా మెరుగైన విధానాలను ఉపయోగిస్తున్నారు. అయితే డిస్ప్లేల విషయానికి వస్తే ఫోల్డబుల్ ఫోన్‌లలో రెండు డిస్ప్లేలను కలిగి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లలో 5 నుంచి 6-ఇంచ్ ల ఒకే ఒక డిస్ప్లేను మాత్రమే కలిగి ఉంటాయి. కావున ఫోల్డబుల్ ఫోన్‌లు టాబ్లెట్ కు సమానమైన స్క్రీన్ ను కలిగి ఉంటాయి. అయితే అవసరం లేని సమయంలో శుభ్రంగా మడిచి స్మార్ట్‌ఫోన్‌ వలె సులభంగా ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకుపోవడానికి వీలుగా ఉంటుంది.

ఫోల్డబుల్ ఫోన్‌ vs స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్ సామర్థ్యం

ఫోల్డబుల్ ఫోన్‌ vs స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్ సామర్థ్యం

ఇండియాలో ఎక్కువగా ‌స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్ ఉంది. మార్కెటింగ్ పరంగా చూసుకుంటే ఫోల్డబుల్ ఫోన్‌ల మార్కెటింగ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా తక్కువగానే ఉంది. ఇండియాలో ఫోన్లను ఉపయోగిస్తున్న ప్రతి 100 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ఫోల్డబుల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం ఫోన్ యొక్క ధర కూడా ఉంది. ప్రస్తుతం కొన్ని సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్‌లను వాటర్ ప్రూఫ్ తో కూడా తీసుకువస్తున్నాయి కావున అధిక ధరలో ఫోన్ లను కొనుగోలు చేయాలనుకునే వారు ఇటువంటి ఫీచర్లను కలిగి ఉన్న వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

ఫోల్డబుల్ ఫోన్‌ vs స్మార్ట్‌ఫోన్ హార్డ్ వెర్ సమస్యలు

ఫోల్డబుల్ ఫోన్‌ vs స్మార్ట్‌ఫోన్ హార్డ్ వెర్ సమస్యలు

ఫోల్డబుల్ ఫోన్‌లు మరియు స్మార్ట్‌ఫోన్లలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. శామ్సంగ్ మరియు హువాయి సంస్థలు విడుదల చేసిన ఫోల్డబుల్ ఫోన్‌లలో ఫోల్డింగ్ సమస్యలను మొదట గుర్తించారు. తరువాత వాటిని పరిష్కరించి విడుదల చేసినప్పటికీ భవిషత్తులో ఎదో ఒక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నా తరఫునుంచి ఫోన్ లను ఎక్కువ రఫ్ గా ఉపయోగించే వారికి ఈ ఫోన్లు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇటువంటి సమస్యలు లేకపోలేదు. ఫోన్లు అనేవి ప్రతి ఒక్కటి సున్నితంగానే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిస్ప్లే పాడయితే కనుక తక్కువ మొత్తం చెల్లించి మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఫోల్డబుల్ ఫోన్‌లలో ఇటువంటి పరిష్కారం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న కూడా అధిక మొత్తం చెల్లించవలసి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Foldable Phones vs Smartphones: Which one is Best For Using
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X