Foldable స్మార్ట్‌ఫోన్‌లను కొంటున్నారా?? ఇది మంచి సమయం కాదు...
ఫోల్డబుల్ డిస్ప్లేలతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్, హువాయి, మోటరోలా మరియు ఇతర రెండు బ్రాండ్‌ల సంస్థలు అందిస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో ఫోల్డబుల్ డిస్ప్లేలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లదే రాజ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

భవిష్యత్తులో ఒక కాగితం లాగా స్క్రీన్ ను మడత పెట్టడానికి వీలుగా ఉండే టెక్నాలజీ మీద అన్ని రకాల మొబైల్ బ్రాండ్లు దృష్టి సారించాయి. కొనుగోలుదారుల విషయానికొస్తే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలోని లోపల కారణంగా నేటి వాస్తవ ప్రపంచంలో ఇవి ఇంకా వెనుకబడి ఉన్నాయి.

ఫోల్డబుల్ స్క్రీన్‌లతో గల ఫోన్‌లను తయారుచేయడానికి ఇప్పుడు ఎక్కువ బ్రాండ్లు పని చేయడంతో దీనికి కావలసిన సాంకేతికత చౌకగా లభిస్తుంది. మీరు ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కింద తెలిపే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

*** ఫోల్డబుల్ ఫోన్లు నిజమైన గ్లాస్ డిస్‌ప్లేలతో ఇంకా తయారవ్వలేదు. సన్నని గాజు పూతతో కాకుండా వాస్తవమైన గాజు డిస్ప్లేలతో వచ్చే మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను చూడటానికి మనం ఇంకా కొంత సమయం వేచి ఉండాలి. ప్లాస్టిక్ లేదా హైబ్రిడ్ గాజు డిస్ప్లేలు వేలుగోళ్ల నుండి కూడా గీతలు పడే అవకాశం ఉంది.

*** ఫోల్డబుల్ ఫోన్ల డిస్‌ప్లేలను రక్షించడానికి స్క్రీన్ కార్డు ఇప్పటి వరకు అందుబాటులో లేదు. స్మార్ట్‌ఫోన్ యొక్క టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలతో పనిచేస్తాయి కావున రెగ్యులర్ వాడుక సమయంలో వాటి మీద గీతలు ఖచ్చితంగా పడతాయి. కావున ఈ సమస్యల నుండి సురక్షితంగా ఉంచడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రొటెక్షన్ గొరిల్లా కార్డు అందుబాటులో లేదు.

*** ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లు రియల్ గ్లాస్ డిస్‌ప్లేలను ఉపయోగించనందున ఫోన్లను మీరు ఉపయోగించిన కొద్ది నెలల్లోనే డిస్‌ప్లేల మీద గీతలు మరియు గడ్డలు సులభంగా ఏర్పడుతాయి.

*** ఇప్పటివరకు ప్రారంభమైన ఫోల్డబుల్ ఫోన్‌లలో ఏదీ కూడా టాప్-ఆఫ్-లైన్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్ లతో రాలేదు. ఇప్పటివరకు ప్రారంభించిన ఫోల్డబుల్ ఫోన్‌లలో ఏదీ 2020 యొక్క అన్ని టాప్-ఎండ్ ఫోన్‌లకు శక్తినిచ్చే ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 865 SOC తో రన్ అయ్యేది లేదు. ధరల విషయంలో కూడా ఇవి భారీగా ఉన్నాయి.

ఇప్పటివరకు ప్రారంభించిన అన్ని ఫోల్డబుల్ ఫోన్‌లు మరమ్మతు పరీక్షల్లో పేలవంగా ఉన్నాయి. మోటరోలా రజర్‌ను ఐఫిక్సిట్ మరమ్మతుల కోసం ‘అత్యంత క్లిష్టమైన' ఫోన్ అని పిలుస్తారు. ఫోల్డబుల్ ఫోన్‌లు ఒక సారి రిపేర్ చేయడానికి ఇస్తే కనుక వాటిని మరిచిపోవడం చాలా మంచిది.

*** ఫోల్డబుల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి. అంతగా ఆకట్టుకోలేని మరమ్మత్తు స్కోర్‌లు మరమ్మత్తు ఖర్చులతో దాదాపుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోల్డబుల్ ఫోన్‌ల నిర్వహణ అధికంగా ఉన్నందున మీరు తప్పనిసరిగా వాటిని మీ సాధారణ పరికరంగా ఉపయోగించలేరు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు రద్దీగా ఉంది. ధర విభాగాలలో చాలా రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అలా కాదు. దీని యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇంకా నిర్మాణ దశలో ఉన్నందున కొనుగోలుదారులకు ఎక్కువ ఎంపికలు అందుబాటులో లేవు.

మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లను మాత్రమే కాకుండా టాప్-ఎండ్ కెమెరా ఫీచర్లను కూడా కోల్పోతారు. ఇప్పటి వరకు గల ఫోల్డబుల్ ఫోన్లు ఏవీ కూడా తమ ఆవిష్కరణలలో గొప్ప కెమెరా ఫీచర్లను అందివ్వలేదు. దీని కంటే చాలా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో మంచి కెమెరా ఫీచర్లను పొందవచ్చు.

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి గల అతిపెద్ద కారణం దాని యొక్క ఫోల్డబుల్ డిజైన్ మరియు అతి పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండడం. కొనుగోలుదారులను ఆకట్టుకొనే మరొక గొప్ప విషయం ఇప్పటివరకు ఇందులో మరొకటి లేదు.


Click it and Unblock the Notifications







