శాంసంగ్ నెత్తిన మరో బాంబు, ఈ సారి ఫోన్లు కాదు..

Written By:

శాంసంగ్ నెత్తిన మరో బాంబు పడింది. మొన్నటికి మొన్న గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో సతమతమైన కంపెనీ ఇప్పుడు వాషింగ్ మెషిన్ ల బారిన పడింది.ఇప్పుడు శాంసంగ్ వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో అమెరికాలో 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. శాంసంగ్ ఇక ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనపడటం లేదు.

మా ఫోన్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: లేకుంటే పెను ప్రమాదం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

30 లక్షల మెషీన్లను రీకాల్

శాంసంగ్ కు మరో కష్టం వచ్చిపడింది. పేలుతున్న వాషింగ్ మెషీన్లతో సంస్థ దాదాపు 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది.

బాంబు పేలినంత పెద్ద శబ్దం

శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలినపుడు బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని చెబుతున్నారు వినియోగదారులు. తీవ్రమైన వైబ్రేషన్ రావడం లేదా వాషింగ్ మెషిన్ పైన ఉండే టాప్ భయంకరమైన శబ్దంతో పేలిపోవడం జరుగుతోందంటూ వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు.

పేలుళ్ల సందర్భంగా

ఈ పేలుళ్ల సందర్భంగా దవడ, భుజాలు విరిగిపోవడం లాంటి తీవ్ర గాయాలైన దాదాపు 733 కేసులు నమోదు కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను

2011 లో విక్రయించిన 34 మోడళ్ల మొత్తం 2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను వెనక్కి తీసుకుంది శాంసంగ్. అయితే నార్త్ అమెరికా వెలుపల అమ్మిన మోడల్స్ లో ఈ ప్రభావం లేదని చెప్పింది.

ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు

ఈ నేపథ్యంలో ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు ఫ్రీగా రిపేరు చేయించుకోవచ్చని, లేదా నగుదును మొత్తం తిరిగి తీసుకోవచ్చని తెలిపింది శాంసంగ్.

మరో శాంసంగ్ మెషీన్‌తో ఎక్సేంజ్ చేసుకుంటే

లేదంటే మరో శాంసంగ్ మెషీన్‌తో ఎక్సేంజ్ చేసుకుంటే స్పెషల్ రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. తమ విశ్వసనీయ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు చెప్పింది.

వినియోగదారులకు హెచ్చరికలు

మరోవైపు అమెరికాకు చెందిన కన్జ్యూమర్ సేఫ్టీ ప్రొడక్షన్ అధికారులు (సీపీఎస్-సీ) కూడా ఈ విషయంలో వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఆస్ట్రేలియాలో లక్షా యాభైవేల వాషింగ్ మెషిన్లను రీకాల్

తక్షణమే రిపేర్ చేయించుకోవాలని లేదా సేఫ్టీ కిట్ వాడాలని సూచించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో లక్షా యాభైవేల వాషింగ్ మెషిన్లను రీకాల్ చేసింది శాంసంగ్.

గెలాక్సీ నోట్ 7 పేలుళ్లు సృష్టించిన వివాదంతో

కొరియాకు చెందిన ఈ మొబైల్ మేకర్ తన తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లు సృష్టించిన వివాదంతో భారీ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Following Galaxy Note 7 recall, Samsung recalls 2.8 million washing machines in the US read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot