అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల మోజులో పడి

సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది.

|

సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదం దాదాపు 60 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరగాడానికి ముఖ్య కారణం ఒకటి రైల్వే ట్రాక్ పక్కన వేడుకలు నిర్వహించడమయితే మరొకటి వేడుక చూడ్డానికి వచ్చిన జనాలు వీడియోలు తీస్తూ సెల్ఫీలు దిగుతూ పరిసరాలను పట్టించుకోలేదు అంటున్నారు అక్కడి స్థానికులు.

రూ.14,999 కడితే iPhone Xr మీ సొంతం...రూ.14,999 కడితే iPhone Xr మీ సొంతం...

చౌరాబజార్ లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు...

చౌరాబజార్ లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు...

అమృత్ సర్ లోని చౌరాబజార్ లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ రావణ దహన కార్యక్రమం రైల్వేట్రాక్ పక్కనే నిర్వహించడం ఘటనకు ప్రధాన కారణమైతే సెల్ఫీల మోజు మరో కారణంగా స్థానికులు చెప్తున్నారు.

 ప్రజలు సెల్ఫీలు తీసుకుంటూ రైలు వస్తుందన్న విషయాన్ని గమనించలేదు....

ప్రజలు సెల్ఫీలు తీసుకుంటూ రైలు వస్తుందన్న విషయాన్ని గమనించలేదు....

రావణ దహనాన్ని తిలకిస్తున్న ప్రజలు సెల్ఫీలు తీసుకుంటూ రైలు వస్తుందన్న విషయాన్ని గమనించలేదని చెప్తున్నారు. మరికొంతమంది వీడియోలు తీసుకుంటూ అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

ఒక వైపు బాణాసంచా హడావుడి మరో వైపు ఫోన్‌లో బిజీగా ఉన్న జనాలు...

ఒక వైపు బాణాసంచా హడావుడి మరో వైపు ఫోన్‌లో బిజీగా ఉన్న జనాలు...

ఒక వైపు బాణాసంచా హడావుడి మరో వైపు ఫోన్‌లో బిజీగా ఉన్న జనాలు తాము ఉన్న పరిసారలను మర్చిపోయారు. ఇంతలో రైల్వే ట్రాక్‌పై నిల్చుని రావణ దహన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది.

వేరే ట్రాక్ పై వెళ్లి తప్పించుకుందాం అనుకునే సరికి....

వేరే ట్రాక్ పై వెళ్లి తప్పించుకుందాం అనుకునే సరికి....

వేరే ట్రాక్ పై వెళ్లి తప్పించుకుందాం అనుకునే సరికి ఆ ట్రాక్ పైనా అదే సమయంలో మరో రైలు రావడంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. దాంతో దసరా పండుగ నాడే వారంతా మృత్యు కౌగిలిలో చిక్కుకుపోయారు.

ఈ ఘటనలో దాదాపు 61 మంది....

ఈ ఘటనలో దాదాపు 61 మంది....

ఈ ఘటనలో దాదాపు 61 మంది మృత్యువాత పడగా, మరో 72 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి

Best Mobiles in India

English summary
Footage show people taking selfies from tracks during Amritsar train tragedy.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X