ఫ్లిప్‌కార్ట్‌కు రూ.7 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన విద్యార్థులు

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో కాళ్లు బయట పెట్టకుండానే అన్ని ఒడిలోకి వచ్చిపడుతున్నాయి.

By Anil
|

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో కాళ్లు బయట పెట్టకుండానే అన్ని ఒడిలోకి వచ్చిపడుతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. చేతిలొ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి వస్తువు అయినా తెల్లారేసరికల్లా ఇంటి ముందుకు వచ్చేస్తోంది. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా జరుగుతుంటాయి.బుక్ చేసిన ప్రొడక్ట్ కాకుండా ఇతర డమ్మి ప్రొడక్ట్ లు వినియోగదారులకి అందుతున్నాయి. దీంతో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ కామర్స్ సైట్లు కూడా ఇందుకు మినహాయంపు ఏమి కాదు. అందులో పనిచేసేవారు కస్టమర్ల బుక్ చేసిన ఉత్పత్తులను కాకుండా వేరే వాటిని వారికందిస్తున్న సంఘటనలు రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది. 39 మంది ఫ్లిప్ కార్ట్ కు ఏకంగా రూ. 7 కోట్లు టోపీ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే......

 

గుజరాత్ మెహసానా, పటాన్, అహ్మదాబాద్ జిల్లాలో జరిగిన  సంఘటన:

గుజరాత్ మెహసానా, పటాన్, అహ్మదాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన:

గుజరాత్ మెహసానా, పటాన్, అహ్మదాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 39 మంది ఫ్లిప్ కార్ట్ ఖాతాదారులకు ఆర్డర్ ను రద్దు చేసి, వారు తిరిగి చెల్లింపు మొత్తాన్ని ఫ్లిప్ కార్ట్ ద్వారా ఒకసారి SBI బ్యాంకు ద్వారా ఒకసారి తీసుకొని రెట్టింపు చేసుకున్నారు.

ఎక్కువగా విద్యార్దులే :

ఎక్కువగా విద్యార్దులే :

ఈ కుట్రలో పాలుపంచుకున్నవారు ఎక్కువుగా విద్యార్థులే గమనార్హం. తమకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేయడానికి ఫ్లిప్ కార్ట్ ద్వారా క్రెడిట్ పొందేవారు వారి అకౌంట్ లోకి అదే డబ్బులు వారి SBI బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేది.వినియోగదారులు డబ్బును రెట్టింపు చేసుకుంటున్నారని తెలుసుకున్నప్పటి నుంచి వారు మళ్లీ మళ్లీ అదే ప్రక్రియను రిపీట్ చేసేవారు.

విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా:
 

విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా:

విద్యార్థుల నుండి వారి కుటుంబం సభ్యులు మరియు బంధువులకు ఈ విషయం విస్తరించింది, వాళ్ళు కూడా ఫ్లిప్ కార్ట్ నుండి ఆర్డర్లను బుక్ చేయడం మరియు రద్దు చేయటం మొదలుపెట్టారు. అయితే మొత్తంగా 39 SBI అకౌంట్స్ నుంచి 1,090 ట్రాన్సక్షన్స్ జరిగాయి దగ్గర దగ్గర 7 కోట్లు దాకా ఫ్లిప్ కార్ట్ కు టోపీ పెట్టారు.

మాస్టర్ కార్డు , వీసా లేదా రూపీ :

మాస్టర్ కార్డు , వీసా లేదా రూపీ :

ఆన్ లైన్ లావాదేవీ రద్దులలో, కొనుగోలుదారులకు వ్యాపారుల నుంచి తిరిగి చెల్లించడం జరిగేది. మాస్టర్ కార్డు , వీసా లేదా రూపీ వంటి చెల్లింపు మాస్టర్స్ నుండి నిధులు మరియు సలహాలను అందుకునేవారు.అయితే వీసా క్రొత్త ఆన్ లైన్ రీఫండ్ ప్రాజెక్ట్ ను తెచ్చింది , డబ్బు నేరుగా వినియోగదారులకు క్రెడిట్ అయ్యే విధంగా తీసుకొచ్చింది .

దర్యాప్తు జరుగుతోంది:

దర్యాప్తు జరుగుతోంది:

పాత మరియు కొత్త వ్యవస్థ యొక్క ఓవర్ ల్యాప్ కారణంగా ఈ సమస్య తలెత్తింది అని ఫ్లిప్ కార్ట్ చెబుతుంది.కాగా ఈ కేసును SBI మోసంగా వ్యవహరించింది.దీని పై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. SBI జారీ చేసిన నివేదిక ప్రకారం, డిసెంబర్ త్రైమాసికంలో, బ్యాంక్లో మోసం కేసులు 40 శాతం పెరిగాయి మరియు ఈ కేసులలో పాల్గొన్న మొత్తాలు 324 శాతం పెరిగాయి.

Best Mobiles in India

English summary
For cancelling Flipkart orders, SBI account holders get double refund. Here’s How.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X