2007వ సంవత్సరం తర్వాత 2011 సాప్ట్‌వేర్ ఉద్యోగాలకు ల్యాండ్ మార్క్

Posted By: Staff

2007వ సంవత్సరం తర్వాత 2011 సాప్ట్‌వేర్ ఉద్యోగాలకు ల్యాండ్ మార్క్

బెంగళూరు: 2007వ సంవత్సరం సాప్ట్‌వేర్ ఉద్యోగుల సంవత్సరం. ఆ తర్వాత ఒక్కసారిగా రెసిషన్ రావడంతో సాప్ట్‌వేర్ ఉద్యోగులు బజారున పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు సాప్ట్‌వేర్ పరిశ్రమ మళ్శీ కోలుకోని నిలదోక్కుకుంది. దాంతో 2007వ సంవత్సరం తర్వాత 2011 క్యాలెండర్ ఇయర్ సాప్ట్‌వేర్ ఉద్యోగాలకు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ సంవత్సరం సాప్ట్‌వేర్ ఉద్యోగాల నియమాకాలు దాదాపు 60 శాతం నుండి 70 శాతం వరకు జరిగాయంటున్నారు.‌ పోయిన సంవత్సరం గనుక చూసుకున్నట్లైతే ఈ నియామకాలు 20 శాతం మాత్రమే జరిగాయి.

ఈ సంవత్సరం కొత్తగా చదువులు అయిపోయి దాదాపు 2లక్షల మంది ప్రెష్ గ్యాడ్యుయేట్స్ ఉద్యోగాలలో చేరునున్నట్లు మార్కెట్స్ చెబుతున్నాయి. అదే విధంగా సాప్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి 3లక్షల మంది మరలా ఉద్యోగాల వేటలో పడ్డట్లు వెల్లడించారు. దీంతో పాటు దాదాపు ఒక లక్ష మంది బియస్‌సి(కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజక్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటివారు దేశం మొత్తం మీద సాప్ట్‌వేర్ పరిశ్రమలోకి రావడం జరిగింది.

ఇకి ఐటి/ఐటిఈయస్ ఇండస్ట్రీకి చెందినటువంటి దాదాపు 15లక్షల మంది జనాభాలో 25శాతం మంది కొత్త జాబ్‌లను వెతుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కంటే బయట వారికి ఎక్కవ అవకాశాలు రావడమే ఇలా చేయడానికి ముఖ్య కారణం అని బిఎస్ మూర్తి సిఈవో(లీడర్ షిప్ క్యాపిటల్) తెలియజేశారు. 2010వ సంవత్సరంతో పోల్చుకుంటే క్యాంపస్ లలోగానీ, బయట గానీ దాదాపు 2లక్షల మంది సెలక్ట్ అవ్వగా అదే ఈ సంవత్సరం మాత్రం 4లక్షల మందిని సెలక్ట్ చేసినట్లు సాప్ట్‌వేర్ వర్గాల సమాచారం.

ఇక 2009వ సంవత్సరాన్ని చాలా వరస్ట్ సంవత్సరంగా పరిగణించడం జరిగింది. ఆ సంవత్సరంలో కనీసం క్యాంపస్ ఇంటర్యూస్ చేయడానికి కూడా కంపెనీలు చాలా భయపడ్డాయి. దానికి కారణం రెసిషన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో లాంటి కంపెనీలు కూడా ఈ సంవత్సరం వారి ఉద్యోగ నియామకాలను కూడా చాలా ఎక్కువ చేశాయి. ఇక ఈ సంవత్సరం టాప్ కంపెనీలు అయినటువంటి ఐబియమ్, హెచ్‌పి, క్యాప్‌జెమిని లాంటి కంపెనీలు ప్రెషర్స్‌ని 70 శాతం నుండి 80 శాతం వరకు హైరింగ్ చేసుకున్నట్లు వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot