ఫోటోలను మీకు కావాల్సినట్లు మార్చుకోవాలంటే సూపర్ సాఫ్ట్ వేర్

Posted By: Staff

ఫోటోలను మీకు కావాల్సినట్లు మార్చుకోవాలంటే సూపర్ సాఫ్ట్ వేర్

మనుషులు చనిపోయిన తర్వాత కూడా వారి జ్ఞాపకాలు మనం అప్పుడప్పుడు నెమరువేసుకోవడానికి మనకు కావాల్సింది వారి తీపి గుర్తులు. అలాంటి తీపి గుర్తులు మనం ఎప్పుడు మనకు అందుబాటులో ఉంచుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి మంచి వస్తువే వారి ఫోటోలు. కొన్ని ఫోటోలను చూసి మనం ఆ తీపి జ్ఞాపకాలను సరదాగా నెమరువేసుకుంటాం.. అలాంటి మన తీపి గుర్తులను మనకు అందించేటటువంటి ఫోటోలను మనం చాలా భద్రంగా భద్రపరచుకోవాలి. అలా ఫోటోలను భద్రపరచుకోవడానికి మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ఓ సాప్ట్‌వేర్‌ గురించిన సమాచారం అందివ్వడం జరుగుతుంది.

ఫొటోలను కావాల్సిన సైజులోకి సులువుగా మార్చుకోడానికి ఉపయోగించే సాప్ట్‌వేర్ SupeResizer. దీనిని మీరు మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయగానే విండో వస్తుంది. ఈ విండోలో మొట్టమొదట మీరు అమెరికా జెండాపై క్లిక్‌ చేస్తే మొత్తం ఆప్షన్లు ఇంగ్లిష్‌లో కనిపిస్తాయి. Choose Picture Folderపై క్లిక్‌ చేసి ఫొటో ఫోల్డర్‌ను సెలెక్ట్‌ చేయండి. ఇక మీరు ఇమేజ్‌ల సైజు మార్చాలంటే Resize Pictures చెక్‌ చేయాలి.

ఎడిట్‌ చేసిన ఫైల్స్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది Saving Settingsలో ఎంపిక చేసుకోవాలి. ఒరిజినల్‌ ఫైల్స్‌తోనే ఓవర్‌రైట్‌ చేయాలంటే Overwrite original files చెక్‌ చేయ్యాలి. ఫోల్డర్‌లోకి పంపాలంటే Save tosubfolderలో సేవ్‌ చేయండి. Resizing settingsలో ఫొటో పరిమాణాన్ని సెట్‌ చేయాలి. అన్ని ఆప్షన్స్‌ని ఎంచుకున్నా 'స్టార్ట్‌'పై క్లిక్‌ చేస్తే ఫోటో మీకు కావాల్సిన సైజులో వస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting