Home
News

కొత్త iPhone 15 ధర రూ.2 లక్షలు.. భారత్‌లో ఇదే తొలిసారి..!

ఆపిల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iPhone 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 12న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసింది. ఐఫోన్‌ 15 సిరీస్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్‌ ఫోన్లలో అనేక కీలక ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు తొలిసారిగా 3 నానోమీటర్‌ ప్రాసెసర్ A17 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేయనుంది.

అయితే ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లతోపాటు ధరలను కూడా ఆపిల్‌ సంస్థ వెల్లడించింది. అయితే భారత్‌లో సెప్టెంబర్‌ 22 నుంచి ఆపిల్‌ కొత్త ఐఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఆపిల్‌ స్టోర్లతోపాటు ఇంకా ఏ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చో సమాచారం లేదు.

iPhone 15 pro max price reached to rs2 lakh

అయితే భారత్‌లో తొలిసారిగా ఆపిల్‌ కొత్త ఫోన్ ధర సుమారు రెండు లక్షల రూపాయలకు చేరువైంది. ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,99,900గా ఉంది. అంటే కేవలం రూ.100 తక్కువ రెండు లక్షల రూపాయలుగా ఉంది.

ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్‌ ఫోన్ల ప్రారంభ ధర రూ.1,59,000గా ఉంది. ఇవి 256GB, 512GB, 1TB అంతర్గత స్టోరేజీలో అందుబాటులో ఉన్నాయి. అదే ఐఫోన్‌ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.1,34,900గా ఉంది. ఈ ఫోన్‌ 128GB, 256GB, 512GB, 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ఫోన్లు ఐఫోన్‌ 15 సిరీస్‌లో టాప్‌ వేరియంట్‌ ఫోన్లుగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు కొత్తగా వచ్చిన A17 చిప్‌తో రానున్నాయి. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్ అల్యూమినియం ప్రేమ్, ప్రాస్టడ్‌ గ్రాస్‌ సహా బ్లాక్‌, పింక్‌, గ్రీన్‌, బ్లూ, యెల్లో రంగుల్లో లభించనుంది.

ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ఫోన్లు బ్లాక్‌, గ్రే, బ్లూ, వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. టాప్ ఎండ్‌ వేరియంట్‌ ఫోన్లు టైటానియం ప్రేమ్‌తో రానున్నాయి. ఫలితంగా ఈ ఫోన్లు చాలా తేలికగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికతో వస్తాయి.

ఐఫోన్‌ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. టెలీఫోటో కెమెరా సహా వైడ్‌ యాంగిల్‌, ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలు ఉంటాయి. టెలీఫోటో లెన్స్‌ కారణంగా ఆప్టికల్‌, డిజిటల్‌ జూమ్‌ ఫీచర్లను కలిగి ఉంది.

ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్ టెలీఫోటో కెమెరా ద్వారా 5x వరకు జూమ్‌ చేయవచ్చు. సాధారణ ఐఫోన్‌ 15 ప్రో 3x జూమ్‌ సామర్థ్యాన్ని సుమారుగా రెట్టింపుగా రానుంది. భారత్‌, అమెరికా, చైనా, యూకే, కెనడా సహా 40 కంటే ఎక్కువ దేశాల్లో సెప్టెంబర్‌ 15 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 22 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాయి.

Best Mobiles in India

English summary
For the first time in india apple iphone 15 pro max price reached to rs2 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X