ఉచితంతో ఊడ్చుకుపోలేదు, తరాలు తిన్నా తరగని ఆస్తి, మళ్లీ వన్ అతనే

వరుసగా 10 సారి దేశంలో నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్న జియో అధినేత ముఖేష్ అంబాని

By Hazarath
|

ముఖేష్‌ అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గ్యాస్‌ బిజినెస్‌ల నుంచి టెలికాం వ్యాపారాల వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ అధినేత కార్పొరేట్‌ ఇండస్ట్రీసి ఏలుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా 10వ ఏడాది దేశంలో అత్యంత ధనికవంతుడుగా ముఖేష్‌ అంబానీనే మళ్లీ టాప్‌లో నిలిచారు. 2017 సంవత్సరానికిగానూ దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల వార్షిక జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసింది. ఇందులో 38 బిలియన్‌ డాలర్ల సంపదతో ముఖేశ్‌ అంబానీ భారత్‌ జాబితాలో టాప్‌లో ఉన్నారు.

నాన్ స్టాప్‌గా 5 గంటలు, మిస్టరీగా మారిన జియో వాయిస్ కాల్స్ !నాన్ స్టాప్‌గా 5 గంటలు, మిస్టరీగా మారిన జియో వాయిస్ కాల్స్ !

రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో..

రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో..

38 బిలియన్‌ డాలర్ల సంపదతో అంటే దాదాపు రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితాలో ముఖేష్‌ తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ ఏడాది ఆయన తన నికర సంపదను 15.3 బిలియన్‌ డాలర్లను పెంచుకున్నారు.

రెండవస్థానంలో విప్రో ఛైర్మెన్ అజిమ్‌ ప్రేమ్‌జీ

రెండవస్థానంలో విప్రో ఛైర్మెన్ అజిమ్‌ ప్రేమ్‌జీ

ఇక రెండవస్థానంలో విప్రో ఛైర్మెన్ అజిమ్‌ ప్రేమ్‌జీ నిలిచారు. 19 బిలియన్ డాలర్లతో ప్రేమ్ జి దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన ఆస్తిలో చాలా భాగాన్ని ధానదర్మాలకే ఈ టెక్ కోటీశ్వరుడు వినియోగిస్తున్నారు.

దానధర్మాల్లో దేశంలో నెంబర్ వన్

దానధర్మాల్లో దేశంలో నెంబర్ వన్

ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 2014 వరకు కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే తన వ్యక్తిగత సంపద నుంచి రూ. 12,316 కోట్ల నిధులను దానధర్మాల కోసం వెచ్చించి దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని ఈ దాన కర్ణుడు దక్కించుకున్నారు. చైనాకు చెందిన 'ద హరూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' చేసిన రీసెర్చ్ ఈ విషయాన్ని తెలిపింది.

ఎయిర్‌టెల్ అధినేత మాత్రం..

ఎయిర్‌టెల్ అధినేత మాత్రం..

జియోకి గట్టి పోటీనిస్తున్న ఎయిర్‌టెల్ అధినేత మాత్రం టెక్ బిలియనీర్ల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతున్నారు. సునీల్ మిట్టల్ సంపద విలువ 8.3 బిలియన్ డాలర్లు.

Best Mobiles in India

English summary
Forbes India Rich List Out, Mukesh Ambani Tops for 10th Year in a Row Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X