గూగుల్‌ని మరచిపోండి: మీకోసం నేను వస్తున్నాను మైక్రోసాప్ట్ ఎంపోరియా

Posted By: Staff

గూగుల్‌ని మరచిపోండి: మీకోసం నేను వస్తున్నాను మైక్రోసాప్ట్ ఎంపోరియా

సాప్ట్‌వేర్ గెయింట్ మైక్రోసాప్ట్ త్వరలో ఓ సెర్చ్ ఇంజన్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెర్చ్ ఇంజన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి గూగుల్ ఎదుర్కునే విధంగా తమ సెర్చ్ ఇంజన్ రూపోందించడం జరుగుతుందని, దానిని ప్రస్తుతానికి టెస్టింగ్ చేసే పనిలో తమ నిపుణులు ఉన్నారని తెలియజేశారు. మైక్రోసాప్ట్ కొత్తగా విడుదల చేయబోయేటటువంటి సెర్చ్ ఇంజన్ పేరు ఎంపోరియా. ఎంపోరియా ప్రస్తుతం ప్రోటోటైప్ స్టేజిలో ఉందని, త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని తెలిపారు.

మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న సెర్చ్ ఇంజన్స్ కంటే కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చేవిధంగా మైక్రోసాప్ట్ ఎంపోరియాని తయారుచేయడం జరుగుతుందన్నారు. మైక్రోసాప్ట్ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ ఎంపోరియా ఎలా ఉంటుందంటే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ అయినటువంటి ఫేస్‌బుక్, ట్విట్టర్ సెర్చ్ ఇంజన్ మాదరే చాలా పవర్ పుల్‌గా ఉంటుందన్నారు. మీరు ఏదైనా టాపిక్ మీద సెర్చ్ చేసినప్పుడు మైక్రోసాప్ట్ ఎంపోరియా ఎలా మీకు డేటాని అందిస్తుందంటే కొత్త స్ట్రీమ్స్, కీ కేటగిరీస్ లాంటివి అన్నింటిని ఫిల్టర్ చేసి మీకు మంచి స్టోరీలను అందిస్తుంది.

వచ్చినటువంటి స్టోరీలలో మీకు నచ్చిన వాటిని మీరు చూడోచ్చు. అంతేకాకుండా మీరు పర్టిక్లర్‌గా కొంత మంది వెబ్ సైట్స్‌‌ని ఫాలో చేసేటటువంటి కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకోని రావడం జరుగుతుంది. మీడియా కధనం ప్రకారం ఐదుగురు మైక్రోసాప్ట్ శాస్రవేత్తలతో కూడిన బృందం కేంబ్రిడ్జిలో తమ పరిశోధనలు మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ ఎంపోరియాని డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే మైక్రోసాప్ట్ మేనేజర్ రాల్ప్ హెర్‌బ్రిక్ బెర్లిన్‌లో జరిగిన next11 conferenceలో ఎంపోరియా ప్రాజెక్టుకి సంబంధించిన ప్రోటోటైప్‌ని ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఎంపోరియా ప్రాజెక్టు ఎక్కడ లభ్యమవతుందంటే ఎవరైతే మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్‌ని వాడుతున్నారో వారికి మాత్రమే సుపరిచితం ఈ సెర్చ్ ఇంజన్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot