విప్రో బోర్డులో చేరిన హిందుస్థాన్‌ యునీలివర్‌ లిమిటెడ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌

Posted By: Super

విప్రో బోర్డులో చేరిన హిందుస్థాన్‌ యునీలివర్‌ లిమిటెడ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌

బెంగళూరు: హిందుస్థాన్‌ యునీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌) మాజీ వైస్‌ ఛైర్మన్‌ మహేంద్రకుమార్‌ శర్మ విప్రో లిమిటెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో చేరారు. 11 మంది సభ్యులు గల విప్రో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ గ్రూప్‌లో జులై 1 నుంచి శర్మ విధులు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శర్మ ఎంపికపై స్పందించిన విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ..అత్యున్నత విలు వలు, సామర్థ్యం కలిగిన నిపుణులను ఎప్పు డూ విప్రో విస్మరించదన్నారు. శర్మ నియామ కం భవిష్యత్తులో తమ సంస్థ ఎదుగుదలకు కీలకం కాగలదనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా అజీమ్‌ ప్రేమ్‌జీ వ్యక్తం చేశారు.

మరో వైపు శర్మ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకీ దిక్సూచీగా వెళ్తున్న విప్రోలో ఓ సభ్యున్ని అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా శర్మ ప్రస్తుతం ఐసిఐసిఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపె నీ లిమిటెడ్‌, బిర్లా కార్పోరేషన్‌ లిమిటెడ్‌, ఫుల్‌ఫోర్డ్‌ ఇండియా లిమి టెడ్‌, కెఈసి ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, స్కర్డర్‌ డంకన్‌ లిమిటెడ్‌లలో కొన్నింటికి స్వతంత్ర డైరెక్టర్‌గా, మరికొన్నింటికి నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot