గేమింగ్ ప్రియులకు శుభవార్త, ఫోర్ట్‌నైట్ గేమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో..

ఫోర్ట్ నైట్ ప్రపంచంలో గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో ఈ గేమ్‌కు బానిసలైన గేమింగ్ ప్రియులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.

|

ఫోర్ట్ నైట్ ప్రపంచంలో గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో ఈ గేమ్‌కు బానిసలైన గేమింగ్ ప్రియులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటి వరకూ పీసీ గేమ్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ గేమ్ ప్రస్తుతం మొబైల్ వెర్షన్ లోకి మారనుంది. అంటే యాండ్రయిడ్ లో కూడా ఫ్రంట్‌లైన్ లభించనుంది. బాటిల్ రాయేల్ అనే మూడో వ్యక్తి ఒక షూటర్ కేంద్రంగా ఈ గేమ్ సాగుతుంది. ఈ గేమ్ ఆడేందుకు ఉచితంగా లభ్యమవుతోంది. అయితే ఈ గేమ్ లో మీరు ఎంపిక చేసుకున్న కారెక్టర్ యొక్క కాస్ట్యూమ్స్, స్కిన్స్ లాంటివి ఆన్ లైన్ లో కొనాల్సి ఉంటుంది. ఫోర్ట్‌నైట్ గేమ్ లో మొత్తం 100 మంది ఆయుధాల్లేని ఆటగాళ్లు ఉంటారు.

స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?

మ్యాప్ ఆధారంగా..

మ్యాప్ ఆధారంగా..

వారికి ఒక మ్యాప్ ఆధారంగా గన్స్, బాంబులు, అలాగే ఇతర ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఆటగాళ్లు ఒక ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ హంట్ నిర్వహించాలి. అందులోనే షెల్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాప్ ఆధారంగా గేమ్ లోని టాస్క్ లు నిర్వహించాల్సి ఉంటుంది. గేమ్ లో జీవించి ఉండాలంటే శత్రువులను తుదముట్టిస్తూ ముందుకు కదలాల్సి ఉంటుంది. ట్రాప్ వేయడం, దోబూచులాట ఆడటం, షార్ప్ షూటింగ్ లాంటి యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. మీరు బతికి ఉండి, గన్స్ కు సరిపడా మందుగుండు మిగిలి ఉండి, టాస్క్ లు పూర్తి చేస్తే చాలు మీరు ఒక్కో లెవల్ గెలుస్తూ ఉండవచ్చు. చివరి స్టేజ్ లో ఈ గేమ్ మరింత ఎక్జయిటింగ్ గా ఉంటుంది. అయితే చివరి వరకూ బతికి ఉండటమే అసలైన చాలెంజ్.

ఫోర్ట్‌నైట్ ఎందుకు అంత ఆదరణ ?
 

ఫోర్ట్‌నైట్ ఎందుకు అంత ఆదరణ ?

ఫోర్ట్‌నైట్ ఆన్ లైన్ లో ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు ఈ గేమ్ మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఫోర్ట్‌నైట్ : బాటిల్ రాయెల్ పూర్తిగా ఉచితంగా ఆడవచ్చు. ఇందులో ప్లేయర్స్ మరో ప్లేయర్ తో తలపడే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం పీవీపీ (ప్లేయర్ వర్సెస్ ప్లేయర్) స్టైల్ లో ఉంటుంది. 2017 జూలైలో కొత్తగా సేవ్ ది వరల్డ్ పేరిట మరో వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని కోసం ఆన్ లైన్ లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మరింత సరికొత్త మిషన్స్, సరికొత్త చాలెంజీలతో గేమ్ ఆసాంతం చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఈ సేవ్ ది వరల్డ్ వెర్షన్ ప్రస్తుతం మొబైల్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. దాని వివరాలేంటో చూద్దాం..

గతంలో ఎన్నో విజయవంతమైన కాన్సెప్ట్ లతో

గతంలో ఎన్నో విజయవంతమైన కాన్సెప్ట్ లతో

ఫోర్ట్‌నైట్ గతంలో ఎన్నో విజయవంతమైన కాన్సెప్ట్ లతో ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా "ప్లేయర్ అన్‌నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్" (పీయూబీజీ) పేరుతో కొత్త కాన్సెప్ట్ ను ముందుకు తెచ్చింది. ఇందులో గేమ్ లో భాగంగా నాశనమైన ఎన్నో నిర్మాణాలను తిరిగి పునర్నిర్మించే అవకాశం ఉంది. పీయూబీజీ అలాగే పీయూబీజీ మొబైల్ రెండు వర్షన్లలలో మీకు నచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ ను మీకు నచ్చిన మెటీరియల్ తో తయారు చేసుకోవచ్చు. గోడలు, ఫ్లోర్, మెట్లు సహా అన్నింటినీ తయారుచేసుకునే వీలుంది.

లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ..

లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ..

రియాలిటీ కోసం వాహనాలను కూడా తయారుచేశారు. తద్వారా ప్లేయర్ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను పొందే అవకాశం ఉంది. ప్రతీ వారం కొత్త వెపన్స్, మ్యాప్స్ ను అందుబాటులో ఉంచడం ద్వారా ఫోర్ట్‌నైట్ చాలా ఆదరణ పొందింది. అంతే కాదు ఫోర్ట్‌నైట్ గేమ్ ను ట్విచ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే వీలుంది. చాలా మంది ఔత్సాహికులు తమ ఫేవరెట్ ప్లేయర్ల మధ్య జరిగే ఈ గేమ్ ను లైవ్ ద్వారా చూసే వీలు ట్విచ్ ద్వారా కలిగింది. ప్రస్తుతం పీసీ, మాక్, ఎక్స్‌బాక్స్, పీఎస్‌4, ఐవోఎస్ లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ గేమ్ మరిన్ని ప్లాట్ ఫాంలలో ఆడేందుకు వీలుగా రూపుదిద్దుకోనుంది.

ఫోర్ట్‌నైట్ ఎందుకు ఉచితం ?

ఫోర్ట్‌నైట్ ఎందుకు ఉచితం ?

ఫోర్ట్ నైట్ పూర్తిగా ఉచితం, అది కూడా మల్టీ ప్లేయర్ గేమ్ అందుకే ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందింది. అయితే కొన్ని ఎలిమెంట్స్ మినహా పూర్తిగా ఈ గేమ్ ఆడేందుకు ఉచితం అనే చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద గేమింగ్ ప్లాట్ ఫాం అయిన ఆండ్రాయిడ్ లో ఫోర్ట్ నైట్ అందుబాటులో లేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం. అయితే ఐవోఎస్ లో మాత్రం ప్రస్తుతం ఈ గేమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ గేమ్ ను ఆండ్రాయిడ్ లో ప్రవేశపెట్టడం కాస్త కష్టమైన పనే, ఎందుకంటే ఈ గేమ్ లో కొన్ని బగ్స్ ఉంటాయి. 

ఎప్పటికప్పుడు గేమ్ ఛేంజ్ ..

ఎప్పటికప్పుడు గేమ్ ఛేంజ్ ..

ఆన్ లైన్ సర్వర్లు ఈ బగ్స్ ను క్రాష్ చేస్తుంటాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు గేమ్ ఛేంజ్ అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంలో ప్రవేశపెట్టేందుకు ఫోర్ట్ నైట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫోర్ట్ నైట్ తయారీ సంస్థ ఎపిక్ గేమ్స్ కు ఐఓఎస్ ప్లాట్ ఫాంలో ఐఫోన్ యూజర్ల ద్వారా రోజుకు 2 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది. అయితే సేవ్ ది వరల్డ్ వెర్షన్ ను మొబైల్ లో ప్రవేశ పెట్టడం చాలా ఇబ్బందిగా మారింది. ఇది చాలా స్పేస్ ఆక్రమిస్తుంది.

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఫోర్ట్‌నైట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఫోర్ట్‌నైట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?

ఈ సంవత్సరం మార్చ్ లోనే ఫోర్ట్ నైట్ ఆండ్రయిడ్ ప్లాట్ ఫాంలలో రిలీజ్ అవుతుందని ఎపిక్ గేమ్స్ ప్రకటించింది. అయితే అది మే లేదా జూన్ , జూలై అనే వార్తలు కన్ఫార్మ్ కావాల్సి ఉంది. త్వరలోనే గేమ్ కు సంబంధించిన బీటా వెర్షన్ విడుదల కానుంది.

 మీ ఫోన్లో ఫోర్ట్‌నైట్ పనిచేస్తుందా ?

మీ ఫోన్లో ఫోర్ట్‌నైట్ పనిచేస్తుందా ?

ప్రస్తుతానికి ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లలో ఫోర్ట్‌నైట్ పనిచేస్తోంది. ఇందు కోసం ఐఫోన్ 6ఎస్ నుంచి ఈ గేమ్ ఆడే వీలుంది. ఈ గేమ్ ఐఓఎస్ 11లో పనిచేస్తుంది. ఇక యాండ్రయిడ్ యూజర్లు ఓరియోను ఓఎస్ ను కలిగి ఉండాలి. అలాగే 2 జీబీ ర్యామ్ కలిగి ఉండాలి. సాంసంగ్ గేలాక్సీ ఎస్ 9, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2లలో స్నాప్ డ్రాగన్ 845soc రామ్ కలిగి ఉంది. అలాగే హెచ్టీసీ యూ12, ఎల్‌జీ జీ7, వన్ ప్లస్ 6లలో ఈ గేమ్ సూటబుల్ గాపనిచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్నాప్ డ్రాగన్ 835 కలిగి ఉన్న ర్యామ్ ఫోన్ లలో సైతం ఈ గేమ్ సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Fortnite Mobile: why is it so popular, and when is it coming to Android? more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X